తెలుగు సినీ నటుడు డా. రాజశేఖర్ ( Actor Rajashekar ) ఆరోగ్యం విషయంలో పలు అసత్య ప్రచారాలు జరుగుతున్న తరుణంలో కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తున్నారు. ఆసుపత్రి తరపున వెల్లడైనహెల్త్ బులెటిన్ షేర్ చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా షేర్ చేసిన బులెటిన్ లో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read | Keerthy Suresh: కీర్తి సురేష్ మిస్ ఇండియా ట్రైలర్ విడుదల
కొన్ని రోజుల క్రితం కోవిడ్-19 ( Covid-19 ) సోకడంతో ఆయన బంజారాహిల్స్ లోని ఒక ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వెంటిలేటర్ పై ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన శరీరం చికిత్సకు స్పందిస్తోంది అని ప్రత్యేక వైద్యుల టీమ్ రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు చెక్ చేస్తోంది అని బులెటిన్ లో రాసి ఉంది.
అదే సమయంలో కోవిడ్-19 చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన జీవిత వైరస్ బారీ నుంచి పూర్తిగా కోలుకున్నారు అని .. ఆమెకు నెగెటీవ్ రిపోర్ట్ రావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారని సమాచారం. రాజశేఖర్, జీవితతో పాటు వారి కుమార్తెలు శివానీ, శివాత్మిక కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవలే వారు కూడా కోలుకున్నారు.
His condition is stable and responding to treatment.
Actor Dr. Rajasekhar's Health Bulletin form Citi Neuro Hospital. @ActorRajasekhar@ShivathmikaR pic.twitter.com/GAxxjROIRh— Vamsi Shekar (@UrsVamsiShekar) October 24, 2020
Also Read | Covid-19 Vaccine: కరోనా అంతం అసంభవం అంటున్న బ్రిటిష్ శాస్త్రవేత్త
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR