Tamannaah Bhatia: జెమిని టీవీపై తమన్నాకు కోపమొచ్చింది

Tamannaah Bhatia: ప్రముఖ నటి, మిల్కీ బ్యూటీ తమన్నాకు కోపమొచ్చింది. మాస్టర్ ఛెఫ్ కార్యక్రమంలో తప్పించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛానెల్ యాజమాన్యానికి నోటీసులు పంపింది. లెక్క తేల్చమంటోంది. అసలేం జరిగిందంటే.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 24, 2021, 02:07 PM IST
  • మాస్టర్ ఛెప్ హోస్ట్‌గా తమన్నా స్థానంలో యాంకర్ అనసూయ
  • రేటింగ్స్ లేదనే కారణంతో తమన్నాను తప్పించిన యాజమాన్యం
  • కోపంతో మాస్టర్ ఛెప్ యాజమాన్యానికి నోటీసులు పంపించిన తమన్నా
Tamannaah Bhatia: జెమిని టీవీపై తమన్నాకు కోపమొచ్చింది

Tamannaah Bhatia: ప్రముఖ నటి, మిల్కీ బ్యూటీ తమన్నాకు కోపమొచ్చింది. మాస్టర్ ఛెఫ్ కార్యక్రమంలో తప్పించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛానెల్ యాజమాన్యానికి నోటీసులు పంపింది. లెక్క తేల్చమంటోంది. అసలేం జరిగిందంటే.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో(Tollywood)మిల్కీ బ్యూటీగా ప్రాచుర్యం పొందిన నటి తమన్నా భాటియా. తొలి సినిమా మంచు మనోజ్ నటించిన శ్రీ అయినా..శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీడేస్‌తో మంచి పేరు తెచ్చుకుంది. హ్యాపీడేస్ సినిమా తరువాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా నటిస్తోంది. ఇక బాహుబలి సినిమాతో క్రేజ్ మరీ పెరిగిపోయింది. ఇప్పుడు సినిమాలతో పాటు బుల్లితెరపై దృష్టి సారించింది. ప్రముఖ టీవీ ఛానెల్ రూపొందించిన ఓ కార్యక్రమానికి హోస్ట్‌గా నటించింది. దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రముఖ కుకింగ్ షో..మాస్టర్ ఛెఫ్(Master Chef Program)కార్యక్రమాన్ని జెమినీ టీవి తెలుగులో అందిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రారంభం నుంచి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హోస్ట్ చేస్తోంది. 

ఈ షోకు భారీగా ప్రొమోషన్ చేశారు. అయితే హిందీలో క్లిక్ అయినంతగా తెలుగులో పెద్ద రేటింగ్స్ రాలేదు. ఖర్చుపరంగా చూస్తే తమన్నా భాటియాకు భారీ రెమ్యునరేషన్ తప్పడం లేదు. అందుకే జెమినీ యాజమాన్యం తమన్నా భాటియాను తప్పించి స్టార్ యాంకర్ అనసూయను (Anasuya)తీసుకుంది. తనను తొలగించడంపై ఆగ్రహం చెందిన తమన్నా భాటియా(Tamannah Bhatia)మాస్టర్ ఛెప్ యాజమాన్యానికి నోటీసులు పంపింది. తనకు రావల్సిన బకాయిల్ని చెల్లించాలని ప్రొడక్షన్ హౌస్‌కు లీగల్ నోటీసులు పంపింది. 

Also read: Iconic Structures: ప్రపంచపు ఐదు అద్భుత ఐకానిక్ కట్టడాలేంటో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News