Pushpa 2 Hindi Collections: ‘పుష్ప 2’ వరల్డ్ వైడ్ హిందీ టోటల్ కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్ల లాభాలంటే..

Pushpa 2 World Wide Hindi Box Office Collections: ఐకాన్ అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’ . ఈ సినిమా గతేడాది విడుదలై రికార్డుల బెండు తీసింది. ముఖ్యంగా ఈ చిత్రం తెలుగులో కంటే హిందీలోనే ఇరగదీసింది. అంతేకాదు బాలీవుడ్ లో ఇండస్ట్రీ రికార్డు నమోదు చేసింది. మొత్తంగా థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా మొత్తంగా హిందీలో ఏ మేరకు ఎన్ని కోట్ల లాభాలను కొల్లగొట్టిందంటే..

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 21, 2025, 07:54 AM IST
Pushpa 2 Hindi Collections: ‘పుష్ప 2’ వరల్డ్ వైడ్ హిందీ టోటల్ కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్ల లాభాలంటే..

Pushpa 2 World Wide Hindi Box Office Collections: తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ లో సినిమా వస్తుందంటే ఆడియన్స్ కూడా ఆ సినిమాపై ఓ అంచనాకు వస్తారు. అలాంటిదే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయికలో సినిమా వచ్చిందంటే.. బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే. ఇక వీళ్ల కలయికలో వచ్చిన నాల్గో చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. పుష్ప 1 ది రైజ్ మూవీకి కొనసాగింపుగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ హైప్ మూటగట్టుకుంది. అంతేకాదు తొలి రోజే దాదాపు 296 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్ము రేపింది. మన దేశంలో ఫస్ట్ డే ఈ రేంజ్ వసూళ్లను రాబట్టిన చిత్రం మరేది లేదు.

అంతేకాదు ఈ సినిమా బాలీవుడ్ లో తొలి రోజే.. రూ. 72 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం రేపి ఆల్ టైమ్ హైయ్యెస్ట్ ఫస్ట్ డే రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు బీ టౌన్ లో ఫాస్టెస్ట్ తొలి రూ. 100 కోట్లు.. రూ. 200 కోట్లు.. రూ. 300 కోట్లు.. నుంచి రూ. 800 కోట్లను అతి తక్కువ సమయంలోనే క్రాస్ చేసి బాలీవుడ్ బడా హీరోలు సైతం బిత్తేర పోయేలా అక్కడ ప్రేక్షకులు ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించారు. మొత్తంగా బాహుబలి 2 తర్వాత హిందీ బాక్సాఫీస్ దగ్గర ఓ ప్రాంతీయ చిత్రం ఇండస్ట్రీ రికార్డు నమోదు చేయడం మాములు విషయం కాదు.

మొత్తంగా బాలీవుడ్ లో తొలి రూ. 650 కోట్ల చిత్రంతో పాటు.. తొలి రూ. 700 కోట్లు.. రూ. 750 కోట్ల.. రూ. 800 కోట్లను రాబట్టిన చిత్రంగా కూడా పుష్ప 2 సరికొత్త హిస్టరీ నమోదు చేసింది. ఈ సినిమా హిందీలో మొదటి వారంలోనే రూ. 406.50 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. రెండో వారంలో రూ. 212 కోట్ల నెట్ వసూళ్లు కొల్లగొట్టింది. మూడో వారంలో రూ. 112.75 కోట్లు.. నాల్గో వారంలో రూ. 62.25 కోట్లు.. మొత్తంగా చూసుకుంటే హిందీలో రూ. 830.10 కోట్ల నెట్ కలెక్షన్స్ (రూ. 965 కోట్ల గ్రాస్)వచ్చాయి.  ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. హిందీలో ఈ సినిమా రూ. 1100 కోట్ల వరకు కొల్లగొట్టింది.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

ఇక ఈ సినిమా హిందీలో రూ. 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 202 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా రూ. 388 కోట్లు రాబట్టింది. ఓవరాల్ గా హిందీలో 200 కోట్లకు పైగా లాభాలతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News