Anupama: రొమాన్స్ ఎంజాయ్ చేస్తాం అనుకుంటారు..కానీ నేను అన్ కంఫర్టబుల్ ఫీలయ్యా: అనుపమ

Anupama Parameswaran: మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కి తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ఈ నటి ప్రస్తుతం టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ రొమాన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 26, 2024, 10:01 AM IST
Anupama: రొమాన్స్ ఎంజాయ్ చేస్తాం అనుకుంటారు..కానీ నేను అన్ కంఫర్టబుల్ ఫీలయ్యా: అనుపమ

Tillu Square
ప్రేమమ్, ఆ ఆ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. మొదటి రెండు సినిమాలతోనే యువతను తెగ ఆకట్టుకున్న ఈ హీరోయిన్ ఆ తరువాత వచ్చిన శతమానం భవతిలో మెయిన్ హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ అందుకుంది. అప్పటినుంచి అనుపమకి తెలుగులో అవకాశాలు వరసగా రాసాగాయి. ఈ మధ్య నితిన్ తో చేసిన కార్తికేయ చిత్రంతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తరువాత వచ్చిన 18 పేజెస్ యావరేజ్ చిత్రంగా నిలవగా ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డతో టిల్లు స్క్వేర్ సినిమాతో రానుండి.

అయితే ఈ సినిమా మొదటి గ్లింప్స్ విడుదలైన దగ్గర నుంచి అనుపమ సెంటర్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ గా మారింది. అందుకు ముఖ్య కారణం ఈ చిత్రంలో అనుపమ కొన్ని మితిమీరిన రొమాంటిక్ సీన్స్ లో కనిపిస్తోందని తెలియడం. ఈ విషయం గురించి ఎన్నోసార్లు ఎన్నో ప్రోగ్రామ్స్లో చర్చలు కూడా సాగాయి. సోషల్ మీడియాలో కూడా దీనిపై ఎన్నో పోస్టులు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఉండే ఒక కార్ సీన్ లో అనుపమ కొంచెం ఘాటైన సన్నివేశాల్లో నటించగా ..దానిపై కొంతమంది అభిమానులు నిరాశ కూడా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అనుపమ రొమాన్స్ గురించి చేసిన పలు వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తాజాగా టిల్లు స్క్వేర్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ.. ‘రొమాన్స్ చేయడం సులువేమి కాదు. ఇద్దరు ఇంటిమెంట్ గా ఉన్నదం అనేది ప్రైవేట్ మూమెంట్. కానీ 100 మంది మన చుట్టూ ఉండగా, సెట్ యూనిట్ అందరి ముందర అలాంటి రొమాంటిక్ సీన్ చేయడం అంటే చాలా కష్టమైన విషయం. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రస్తుతం అందరూ ఈ సినిమాలో కార్ సీన్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆ సీన్ చేసి టైంలో నేను చాలా అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను. అందులో నుంచి బయటకి రావడం చాలా కష్టం. అయినా అలాంటి పరిస్థితుల్లో కూడా మనం బాగా యాక్ట్ చెయ్యక తప్పదు, రొమాన్స్ ఎంజాయ్ చేసినట్టు నటించాలి, ప్రేక్షకులను మెప్పించాలి. కానీ అది అంత సులువు కాదు. చూసిన వాళ్లందరూ మేమేదో ఎంజాయ్ చేస్తున్నాము అనుకుంటారు, కానీ అది నిజం కాదు’ అని చెప్పుకొచ్చింది. దీంతో రొమాన్స్ సీన్స్ షూట్ చేసేటప్పుడు నటీనటులు ఎంత ఇబ్బందిపడతారో అన్న విషయాన్ని బయట పెట్టింది ఈ హీరోయిన్.

 

టిల్లు స్క్వేర్ విషయానికి వస్తే సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న ఈ చిత్రం మార్చ్ 29న విడుదలకు సిద్ధంగా ఉంది. పలు వాయిదాల తరువాత ఈ విడుదల తేదీ లాక్ చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

Also Read:  Love Guru Trailer: 'లవ్‌గురు'తో వస్తున్న బిచ్చగాడు హీరో.. ట్రైలర్‌ చూస్తే నవ్వులే

Also Read:  Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News