Vaishnavi Chaitanya Upcoming Movie: 'బేబీ' చిత్రంతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ద్వయం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. అలాగే '90s' వెబ్ సిరీస్‌తో దర్శకుడు ఆదిత్య హాసన్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు యువ ప్రతిభావంతులు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న… చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. ప్రొడక్షన్ నెం. 32 అనే పేరిట ఈ చిత్రాన్ని ప్రకటించింది. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియోను విడుదల చేసింది. '90s' సిరీస్‌లో చిన్న పిల్లవాడిగా ఆదిత్య పాత్ర మనల్ని ఎంతగానో మెప్పించిన సంగతి తెలిసిందే. పది సంవత్సరాల తర్వాత, ఆ పిల్లవాడు పెద్దవాడు అయితే..ఇక అదే పాత్రను ఆనంద్ దేవరకొండ పోషిస్తే, అతనికి ఒక అందమైన ప్రేమ కథ ఉంటే ఎలా ఉంటుందో.. ఆ ఆలోచనపై కథ ఆధారపడి ఈ చిత్రాన్ని రూపొందించారు అని ఈ వీడియో ద్వారా తెలిపారు సినిమా యూనిట్.
వీడియో చివరలో ఆనంద్ దేవరకొండ చెప్పిన "మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూశారు కదా. ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి. ఇది నా స్టోరీ, నీ స్టోరీ, కాదు కాదు మన స్టోరీ. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ." అనే డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రం ఒక డిప్ రొమాంటిక్ డ్రామా, కామెడీ, ఎమోషన్, డ్రామా అద్భుతంగా కలగలిసి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోగలుగుతుంది అని చిత్ర యోని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న హేషమ్ అబ్దుల్ వహాబ్, ఇప్పటికే ఎన్నో సినిమాలలో.. తన మధురమైన మెలోడీలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అందుకే ఈ చిత్రం మ్యూజిక్ పై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. హ జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ నవీన్ నూలి, '90s' సిరీస్ లో తన ప్రతిభతో ప్రశంసలు పొందిన ఛాయాగ్రాహకుడు అజీమ్ మొహమ్మద్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter