Bigg Boss Telugu Elimination: ఓటింగ్ లో రైతు బిడ్డ దూకుడు.. ఈ వారం బిగ్ బాస్ ముద్దుబిడ్డ ఔట్..

Bigg Boss 7 Telugu: మరో వారం రోజుల్లో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో 14 వారం ఎవరు హౌస్ నుంచి వెళ్లిపోతారనేది ఆసక్తికరంగా మారింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2023, 11:32 AM IST
Bigg Boss Telugu Elimination: ఓటింగ్ లో రైతు బిడ్డ దూకుడు.. ఈ వారం బిగ్ బాస్ ముద్దుబిడ్డ ఔట్..

Bigg Boss 7 Telugu 14th Week Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 07 తుదిదశకు చేరుకుంది. ఈసారి ఎలిమినేషన్‌ కోసం కాకుండా టైటిల్ విన్నర్ కోసం ఓటింగ్ పోల్స్ అందుబాటులో ఉంచారు. ఈ రెండు వారాల్లో ఎవరికీ తక్కువ ఓటింగ్ వస్తే వారు ఎలిమినేట్ అవుతారు. ఇక 14 వారం అంబటి అర్జున్ తప్ప మిగతా ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. ఇప్పటికే అర్జున్ ఫినాలే ఆస్త్ర సాధించి ఫైనల్ వీక్ కు చేరుకున్నాడు. ఈసారి టైటిల్ కోసం కంటెస్టెంట్ల మధ్య గట్టిగానే పోటీ ఉంది. 

ఓటింగ్ లో దూసుకుపోతున్న రైతుబిడ్డ..
రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ 41.39 శాతం అత్యధిక ఓట్లతో ఎవరికీ అందనంత స్థానంలో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో 17.68 శాతంతో హీరో శివాజీ, 16.84 శాతంతో ప్రిన్స్ యావర్ మూడో స్థానంలోనూ కొనసాగుతున్నారు. ఇక  సీరియల్ హీరో అమర్ దీప్ 16.18 శాతంతో నాలుగో స్థానంలో, 3.58 శాతం ఓట్లతో అర్జున్ అంబటి ఐదో స్థానంలోనూ ఉన్నారు. ఇక డేంజర్ జోన్ ప్రియాంక, శోభాశెట్టి ఉన్నారు. 2.77 శాతంతో ప్రియాంక ఆరో స్థానంలోనూ, 1.55 శాతం ఓట్లతో శోభా శెట్టి ఏడో స్థానంలో ఉన్నారు. 

ముద్దుబిడ్డను బిగ్ బాస్ కాపాడతాడా?
ఇప్పటి వరకు బిగ్ బాస్ తన ముద్దుబిడ్డ శోభా శెట్టిని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేస్తూ వచ్చాడు. కానీ, ఈసారి మాత్రం కచ్చితంగా శోభా శెట్టి హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు గ్రాండ్ ఫినాలే డిసెంబరు 17న జరగనున్న నేపథ్యంలో.. 15వ వారం మిడ్ వీక్‌లో మరో టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వనున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సారి ప్రిన్స్ యావర్ ను హౌస్ నుంచి పంపించాలని  పెద్ద స్కెచ్ వేశారట బిగ్ బాస్ టీమ్. మరి ఏం జరుగుతుందో చూద్దాం.

Also Read: Hi Nanna Day 1 Collections: హాయ్ నాన్న మూవీకి ఊహించని కలెక్షన్స్.. నాని కెరీర్ లోనే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News