Bollywood director akashdeep Sabir shocking comments on allu arjun: పుష్ప2 సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో డిసెంబర్ 4న సంధ్యథియేటర్ దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు పుష్ప2 మూవీ టీమ్ శ్రీతేజ్ ను విదేశాలకు తీసుకెళ్లి వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ ఘటనలో తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బన్నీ బెయిల్ మీద ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల బాంబేలోని బాంద్రాలో సైఫ్ అలీఖాన్ ఇంటిపై రాత్రిపూట దుండగులు కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో సైఫ్ కత్తిపోట్లకు గురయ్యాడు. సమయానికి ఆస్పత్రి వెళ్లడంతో సైఫ్ మాత్రం ప్రమాదం నుంచి బైటపడ్డాడు. ఈ ఘటన తర్వాత పోలీసులు కొంత మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
అయితే.. వారే నేరం చేశారనే ఆధారాల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ దర్శకనిర్మాత ఆకాశ్ దీప్ సబీర్ తాజాగా.. ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. ఆశాశ్ దీప్ సబీర్ మాట్లాడుతూ.. సైఫ్ అలీ ఖాన్, కరీనాకపూర్ కి ఇప్పుడు వచ్చే కోట్లు సరిపోవడం లేదేమో అని కామెంట్స్ చేశారు. అందుకే వీరు ఇంకా సరైన విధంగా సెక్యురిటీని పెట్టుకొవడం లేదన్నారు.
Read more: Keerthy Suresh: వారెవ్వా.. బోల్డ్ లుక్‌లో మైండ్ బ్లాంక్ చేస్తున్న కీర్తి సురేష్.. పిక్స్ వైరల్..
వీళ్లకు పుష్ప2 హీరో అల్లు అర్జున్ కు ఇచ్చినట్లు వందల కోట్లు రెమ్యునరేషన్ ఇస్తే అప్పుడు సెక్యురిటీ పట్టుకుంటారేమో అంటూ వివాదస్పదంగా మాట్లాడారు. దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై ప్రస్తుతం బన్నీ ఫ్యాన్స్ బాలీవుడ్ డైరెక్టర్ పై మండిపడుతున్నారు. సైఫ్ ఘటనకు బన్నీ ఘటనకు మధ్య పొలికేంటని, మళ్లీ బన్నీని ఎందుకు లాగుతున్నారని ఫైర్ అవుతున్నారు. మొత్తానికి బాలీవుడ్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి అల్లు అర్జున్ ఘటన వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter