Godfather Sequel L2 Empuraan Teaser: మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన 2019 బ్లాక్ బస్టర్ మూవీ ‘లూసిఫర్’కి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ‘ఎల్పి2 ఎంపురాన్.’ ఈ లూసిఫర్ సినిమాని తెలుగులో చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంగా రీమేక్ చేశారు. కాగా ఇప్పుడు ఈ చిత్రం సీక్వెల్ వస్తూ ఉండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం మార్చి 27న తెలుగు, మలయాళ, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్, ఆశీర్వాద్ సినిమాస్ అధినేత ఆంటోని పెరుంబవూర్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. 2019లో విడుదలైన లూసిఫర్ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ‘ఎల్పి2 ఎంపురాన్’ టీజర్ విడుదల కావడంతో ప్రేక్షకుల అంచనాలు మరింతగా పెరిగాయి.
‘ఎల్పి2 ఎంపురాన్’ టీజర్ ఆదివారం విడుదలైంది. ఖురేషి అబ్రామ్ అనే ఊహాజనిత టౌన్‌లో ప్రారంభమైన టీజర్.. పవర్‌ఫుల్ డైలాగ్‌లతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మోహన్ లాల్ పాత్రను “జగదీష్ స్టీఫెన్” అనే డైలాగ్‌తో పరిచయం చేశారు. ఈ యుద్ధం మంచికి, చెడుకి కాదు.. చెడుకి, చెడుకి మధ్య జరుగుతుందంటూ డైలాగ్‌లతో కథకు న్యాయం చేస్తోంది.
టీజర్ చివర్లో మోహన్ లాల్ తన రెండో పేరైన "ఖురేషి అబ్రామ్" అని వెల్లడించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పిన “ఒక్క మాట భాయ్ జాన్, నేను ఎదురు చూస్తున్నాను” అనే డైలాగ్ టీజర్‌కు మరింత ఉత్కంఠను తెచ్చిపెట్టింది.
దీపక్ దేవ్ అందించిన మ్యూజిక్, సుజిత్ వాసుదేవ్ అందించిన విజువల్స్ సినిమాకు ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులలో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. లూసిఫర్ కంటే ఈ సినిమా మరింత గ్రిప్పింగ్‌గా ఉంటుందని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ చిత్రంలో మోహన్ లాల్‌తో పాటు టోవినో థామస్, మంజు వారియర్, నందు, సానియా అయ్యప్పన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మురళీ గోపి కథను అందించగా, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేశారు.
టీజర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. మొదటి భాగం సక్సెస్‌ను మించిన అంచనాలు ఏర్పడ్డాయి. అన్ని భాషల్లో కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని సాధిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదని థీమా వ్యక్తం చేస్తున్నాడు సినిమా యూనిట్.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.