GOAT Movie Review: ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (గోట్) మూవీ రివ్యూ.. విజయ్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Greatest Of All Time (GOAT) Movie Review: దళపతి విజయ్.. తమిళంలో అగ్ర హీరోగా సత్తా చాటుతున్నాడు. గత కొన్నేళ్లుగా ఈయన సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘గోట్’ ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 5, 2024, 12:50 PM IST
GOAT Movie Review: ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (గోట్) మూవీ రివ్యూ.. విజయ్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

నటీనటులు: విజయ్, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్ రెడ్డి, జయరాజ్, శివకార్తీకేయన్ (అతిథి), స్నేహ, మీనాక్షి చౌదరి, అజ్మల్ అమీర్, మోహన్, లైలా తదితరులు

ఎడిటర్: వెంకట్ రాజేన్

సినిమాటోగ్రఫీ: సిద్ధార్ధ్ నూని

సంగీతం: యువన్ శంకర్ రాజా

నిర్మాత: అర్చన కల్పాత్తి, కల్పాత్తి ఎస్ అఘోరం, కల్పాత్తి ఎస్ గణేష్, కల్పాత్తి ఎస్ సురేశ్

దర్శకత్వం: వెంకట్ ప్రభు

విజయ్ తమిళంలో టాక్ సంబంధం లేకుండా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈయన హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వినాయక చవితి  కానుకగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

గాంధీ (విజయ్) రా తరుపున విదేశాల్లో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ చేస్తుంటారు. అతని టీమ్ లో సునీల్ త్యాగరాజన్ (ప్రశాంత్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా), అజయ్ (అజ్మల్ అమీర్) కలిసి ఈ సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉంటారు.   ఓ సందర్భంలో కెన్యాలో జరిగే సీక్రెట్ ఆపరేషన్ లో చంద్ర మీనన్ (మోహన్ ) కుటుంబం చనిపోతుంది. ఆ తర్వాత ఓ సీక్రెట్ మిషన్ నేపథ్యంలో థాయ్ లాండ్ వెళతాడు. అక్కడ అనుకోకుండా అతని కుమారుడు చనిపోతాడు. అనుకోకుండా ఓ పని నిమిత్తం విదేశాలకు వెళ్లినపుడు తనలాగే ఉండే ఓ కుర్రాడిని చూసి  షాక్ కు గురవుతాడు. అతను ఎవరు ? చనిపోయడనుకున్న అతిని కుమారుడు బతికే ఉన్నాడా.. ? చివరకు ఆ కుమారుడు వల్ల గాంధీ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడనేదే ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు వెంకట్ ప్రభు.. తాను రాసుకున్న యాక్షన్ కథలో ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ కలగలపి ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాను తెరకెక్కించాడు. సినిమా స్టార్టింగ్ సీన్స్ లో జేమ్స్ బాండ్ సినిమా తరహాలో విదేశాల్లో సంఘ విద్రోహలను చంపే ఫైట్ సీన్ తో మాస్ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసాడు. ఈ సన్నివేశం యాక్షన్ ప్రియులకు అలరించేలా తెరకెక్కించాడు. అంతేకాదు గతేది కన్నుమూసిన కెప్టెన్ విజయ్ కాంత్ కాసేపు అలా చూపించడం ఆయన అభిమానులను అలరిస్తోంది. ఆ తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ సీన్స్ తో నడిపించి ఇంటర్వెల్ లో చనిపోయడానుకున్న అతని కుమారుడు తిరిగి కలవడంతో ఇంటర్వెల్ ట్విస్ట్ ఇచ్చాడు.

కుమారుడు తన జీవితంలో వచ్చాకా.. గాంధీ జీవితంలో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. అతని కళ్ల ముందే అతని పై ఆఫీసర్ సహా ఓ సహచరుడు చనిపోయే సీన్స్ తో ఇంట్రెస్ట్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాడు. ఇదంత తన కుమారుడే చేస్తున్నాడని తెలుసుకొని ఒకింత షాక్ కు గురవతాడు. తన కుమారుడు  సంఘ విద్రోహ ఎందుకు మారిపోయాడనే విషయాన్ని తెలుసుకొని అతన్ని అరెస్ట్ చేస్తాడు.  చివర్లో స్టేడియం పేల్చేస్తాని టెర్రరిస్ట్ హంగామా చేయడం.. హీరో కాపాడటం వంటివి రొటిన్ గా అనిపిస్తాయి. లాజిక్ కు పక్కన పెడితే..ఓ మాస్ ప్రేక్షకుడికి ఏదైతే కావాలో అదంత ఈ సినిమాలో ఉంది. క్లైమాక్స్ సీన్ లో భారతీయుడు సినిమాను ఫాలో అయినట్టు కనిపించింది. క్లైమాక్స్ లో  ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందని చెప్పాడు వెంకట్ ప్రభు.  ఫైట్స్ విషయంలో బెటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి ఉంటే బాగుండేది. రొటీన్ స్టోరీ అయినా.. మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే ఈ  సినిమాను తెరకెక్కించాడు.  టెక్నికల్ విషయానికొస్తే.. ఫోటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ల్యాగ్ సీన్స్ కొన్ని కట్ చేసి ఉంటే బాగుండేది. యువన్ శంకర్ రాజా తన ఆర్ఆర్ తో ఈ సినిమాను లేపట్టాడు. చాలా చోట్ల సౌండింగ్ తో గూస్ బంప్స్ తెప్పించాడు.

నటీనటుల విషయానికొస్తే..
విజయ్ తండ్రీ కొడుకులుగా.. అది కూడా హీరో కమ్ విలన్ గా రెండు పాత్రల్లో ఎంతో ఈజ్ చూపించాడు. మరోసారి డాన్స్, ఫైట్స్ తో ఈజ్ చూపించాడు. మరోసారి తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. సీనియర్ హీరో ప్రశాంత్ హీరో ఫ్రెండ్ పాత్రలో చక్కని నటన కనబరిచాడు. ప్రభుదేవా, జయరామ్ మరోసారి తన పాత్రల్లో అలరించారు. హీరోయిన్స్ లో స్నేహకు కాస్తంత నటనకు స్కోప్ ఉంది. మీనాక్షి చౌదరికి క్యారెక్టర్ కు యూజ్ చేసుకోలేదు. ఏదో పాట, ముద్దులు అన్నట్టు ఆమె క్యారెక్టర్ ఉంది. బడా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అనగానే ఈ సినిమాను యాక్సెప్ట్ చేసి ఉంటుంది. యోగిబాబు ఉన్నంతలో నవ్వించాడు. ముఖ్యంగా గాంధీ, నెహ్రూ అంటూ సాగే కామెడీ నవ్వులు పూయిస్తుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.

ప్లస్ పాయింట్స్

విజయ్ నటన

ఇంటర్వెట్ ట్విస్ట్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్

ఫస్టాఫ్ ల్యాగ్

లాజిక్ లేని సీన్స్

ఎడిటింగ్

పంచ్ లైన్ .. మాస్ మెచ్చె..  గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)..  

రేటింగ్..2.75/5

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News