NTR 30 Update : ఇలా ఒత్తిడి పెంచొద్దు.. మా భార్యల కంటే ముందే మీకు చెబుతాం.. వేడుకున్న ఎన్టీఆర్

NTR 30 Update at Amigos Pre Release Event ఎన్టీఆర్ కొరటాల శివ చేయబోతోన్న సినిమా గురించి అభిమానులు ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకగా ఎన్టీఆర్ అప్డేట్ ఇచ్చాడు. కానీ ఇలా అప్డేట్ల కోసం ఒత్తిడి పెంచొద్దని వేడుకున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2023, 10:00 PM IST
  • ఈవెంట్లో నందమూరి హీరోల సందడి
  • అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా అప్డేట్
  • కొత్త సినిమా అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్
NTR 30 Update : ఇలా ఒత్తిడి పెంచొద్దు.. మా భార్యల కంటే ముందే మీకు చెబుతాం.. వేడుకున్న ఎన్టీఆర్

NTR 30 Update at Amigos Pre Release Event ఎన్టీఆర్ 30వ సినిమా అప్డేట్ కావాలంటూ అభిమానులు చేస్తోన్న గొడవ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం మీద అభిమానులను మందలిస్తూనే వచ్చాడు. కళ్యాణ్‌ రామ్ అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం గ్రాండ్‌గా నిర్వహించారు. ఫిబ్రవరి 10న రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు అప్డేట్ అంటూ గోల చేశారు.

సినిమాల అప్డేట్ కోసం మీ ఆరాటం, తాపత్రయం, ప్రేమ అన్నీ కూడా మాకు అర్థం అవుతున్నాయ్ కానీ అప్డేట్ అంటూ ఇలా దర్శక నిర్మాతల మీద ఒత్తిడి పెంచొద్దని, నా విషయంలోనే కాదు.. మిగతా నటీనటుల విషయంలోనూ ఇలా చేయొద్దు. మీరు ఇలా చేయడం వల్ల.. ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలనే తొందరపడతారు.. వారి మీద ఒత్తిడి పెరుగుతుంది.. ఇచ్చిన అప్డేట్ బాగా లేకపోతే మళ్లీ మీరే తిడతారు.. 

ఓ మంచి సినిమాను తీయాలని అనుకుంటాం.. ఇప్పుడు మనం గ్లోబల్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం.. ఆ స్థాయికి తగ్గ సినిమాలు తీయాలని అనుకుంటాం.. ఏదైనా అప్డేట్ ఉంటే.. మా భార్యల కంటే ముందుగా మీకే చెబుతాం.. ఎందుకంటే మీరే మాకు ముఖ్యం.. అప్డేట్ ఉంటే.. అది ముఖ్యమైన అప్డేట్ అయితే మీకే ముందుగా చెబుతాం.. దయచేసి ఇలా అప్డేట్ అప్డేట్ అని అడగొద్దు.. ప్రతీ రోజూ ఏదో ఒక అప్డేట్ ఇవ్వలేం..

ఫిబ్రవరిలో సినిమాను ప్రారంభిస్తున్నాం.. మార్చి 20 లేదా.. అంతలోపే సినిమాను స్టార్ట్ చేస్తాం.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న రిలీజ్ చేస్తామని మొత్తానికి తన సినిమా అప్డేట్ ఇచ్చాడు ఎన్టీఆర్. కొరటాల శివతో చేయబోతోన్న ఈ సినిమా అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read:  AK 62 Project Cancelled : గెలికిన అజిత్.. హర్టైన నయనతార భర్త విఘ్నేశ్ శివన్

Also Read: Samantha : జీవితంలో వెలుగుని వెతుక్కోవాలి.. సమంత పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News