Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్'. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ లాస్ట్ ఇయర్ విడుదలై సంచలన విజయం సాధించింది. అయితే గతేడాది విడుదలైన 'ఆదిపురుష్' .. ఆ తర్వాత విడుదలైన సలార్ సినిమాలు ముందుగా అనుకున్న తేదిల్లో విడుదల కాలేకపోయాయి.
మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసిన సలార్ మూవీ కూడా ముందుగా సెప్టెంబర్ అంటూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి.. ఆ తర్వాత డిసెంబర్‌కు వాయిదా వేసారు. ఇయర్ ఎండ్‌లో విడుదలైన ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే అందరు అనుకున్నట్టు రూ. వెయ్యి కోట్ల మార్క్‌ను రీచ్ కాలేకపోయింది. ఓవారాల్‌గా రూ. 700 కోట్ల గ్రాస్ వరకు వచ్చి ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మరో లీడ్ రోల్లో నటించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గతేడాది చివర్లో విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మంచి టాక్‌తో బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. ఇక కన్నడ, ఇతర భాషల్లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఇక సలార్ మూవీ నైజాం (తెలంగాణ) గడ్డపై రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం రేపింది. గతంలో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత మూడో సినిమాగా ఈ మూవీ రికార్డులకు ఎక్కింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అటు హిందీ వెర్షన్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక ప్రభాస్ నటించిన 'సలార్' మూవీని స్పానిష్ భాషలో డబ్ చేసిన మార్చి 7 లాటిన్ అమెరికా దేశాల్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. మరోవైపు 'సలార్' మూవీని జపాన్ దేశంలో సమ్మర్లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ విషయానికొస్తే.. ఇద్దరు ప్రాణ స్నేహితులు..శత్రువులుగా ఎలా మారారనే కథాంశంతో తెరకెక్కింది. ఇక సలార్ రెండో పార్ట్ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. రెండో పార్ట్‌కు సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అనే టైటిల్ ఖరారు చేసారు మేకర్స్. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటించింది.
ఆ సంగతి పక్కన పెడితే.. ప్రభాస్ నటిస్తోన్న మరో భారీ ప్యాన్ వరల్డ్ మూవీ 'కల్కి 2898 AD'. ఈ మూవీని ముందుగా ఈ యేడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ మే 9న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ముందుగా ఈ సినిమా విడుదల తేది వాయిదా పడ్డట్టు వార్తలు వచ్చాయి కానీ.. కానీ సినిమా మే 9న చెప్పిన తేదికే రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. దీపికా హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. ఈ సినిమా మహాభారతంతో మొదలై 2898 ADతో ముగుస్తుందని చెప్పుకొచ్చారు. మొత్తంగా 6 వేల యేళ్ల ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్టు నాగ్ అశ్విన్ చెప్పారు.
నాటి రోజులకు తగ్గట్టు భారతీయత ఉట్టిపడేలా ఓ కొత్త ప్రపంచాన్నే క్రియేట్ చేసాము. ఈ సినిమాలో ప్రముఖ సైన్స్ ఫిక్షన్ హాలీవుడ్ చిత్రం 'బ్లేడ్ రన్నర్' ఛాయలు లేకుండా తెరకెక్కిస్తున్నాము. మరోవైపు ప్రభాస్ 'రాజా సాబ్' మూవీ చేస్తున్నారు.ఇందులో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్ గా ఈ మూవీ రాబోతున్నటు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్ధమవుతోంది. అటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీ చేస్తున్నట్టు ప్రకటించారు. అటు ఫైటర్ మూవీ దర్శకుడు సిద్ఘార్ధ్ ఆనంద్ మూవీ ఉండనే ఉంది. అటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్టు సమాచారం.
Also Read: Telangana: ముఖ్యమంత్రి అవుతాడని రేవంత్ రెడ్డి స్వగ్రామంలోనే ఎవరూ నమ్మలేదు: కేటీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి