Vikram beats Baahubali 2 : లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా సినిమా ‘విక్రమ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రెండు సినిమాలతో సెన్సేషనల్ డైరెక్టర్ అనిపించుకున్న లోకేష్ కనగరాజ్ తెరకెక్కించారు. చాలా కాలం తర్వాత కమల్ నుంచి ఒక ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ రావడంతో ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. కమల్ నుంచి ఇటీవల కాలంలో ఇంత మంచి సినిమా రాక పోవడంతో, ఆయన అభిమానులు ఈ సినిమాను రిపీట్ గా చూసేందుకు ఆసక్తి కనబరిచారు.
అందుకే కేవలం టాక్ వరకే సరిపెట్టుకోకుండా వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమా జూన్ 3న విడుదలై మొదటి ఆట నుంచే పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈమధ్యనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన క్రమంలో యూనిట్ అంతా ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ క్రమంలో యూనిట్ కు మరో గుడ్ న్యూస్ వచ్చినట్టు అయింది. దీంతో ఈ సినిమా మరో సెన్సేషనల్ రికార్డును సాధించినట్టు అయింది.
అదేమిటి అంటే దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి 2 చిత్ర లైఫ్‌టైం రికార్డును విక్రమ్ అధిగమించింది. తమిళనాట బాహుబలి 2 లైఫ్‌టైం కలెక్షన్స్ అయిన రూ.155 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి విక్రమ్ సినిమా మరింత ముందుకు వెళుతోంది. బాహుబలి పేరిట ఉన్న 5ఏళ్ళ రికార్డును విక్రమ్ కేవలం 15 రోజుల్లోనే బ్రేక్ చేసి.. తమిళంలో ఇప్పుడు సరికొత్త ఇండస్ట్రీహిట్‌గా, టాప్ గ్రాసర్ గా అవతరించింది. ఇక ఈ తమిళ సినీ పరిశ్రమలో లో రూ.150 కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి సినిమాగా విక్రమ్ రికార్డు సృష్టించింది. అయితే ఫుట్ ఫాల్స్ విషయంలో మాత్రం ఇంకా బాహుబలి టాప్ లోనే ఉండడం గమనార్హం.
ఇక తెలుగులోనూ ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుంది. తెలుగులో మంచి కలెక్షన్లు సాధించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో హీరో నితిన్ తన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ మీద విడుదల చేశాడు. ఈ సినిమాలో కమల్ మాత్రమే కాక మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి సైతం కీలక పాత్రల్లో నటించారు. సూర్య రోలెక్స్ అనే అతిధి పాత్రలో మెరిశాడు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని ఆర్. మహేంద్రన్‌తో కలిసి తెరకెక్కించాడు.
Also Read:Actor Murderd : యువ నటుడి దారుణ హత్య.. భార్య మరణించిన నెలల వ్యవధిలోనే?
Also Read:Virata Parvam : బ్యాన్ చేయాలి.. సెన్సార్ అధికారి మీద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook