Hyper Aadi Remuneration : మల్లెమాల చేసే షోలు అందరికీ తెలిసిందే. టీఆర్పీల కోసం మల్లెమాల టీం వేసే వేషాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. టీఆర్పీల కోసం కాంట్రవర్సీ మ్యాటర్లను ఎలా క్రియేట్ చేయాలో.. బయట జరిగే వాటిని ఎలా వాడుకోవాలో మల్లెమాల టీంకు బాగానే తెలుసు. ప్రస్తుతం శ్రీదేవీ డ్రామా కంపెనీ మంచి ఫాంలో ఉంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ ఎక్కువగా వినిపించడం లేదు. శ్రీదేవీ డ్రామా కంపెనీ మీదే అంతా ఫోకస్ పెట్టినట్టున్నారు. ఇప్పుడు ఈ షోకు మళ్లీ సుదీర్ రీ ఎంట్రీ ఇచ్చేసినట్టున్నాడు.
అయితే ప్రోమోలో టీఆర్పీలు పెంచుకోవడం మల్లెమాల టీంకు బాగానే తెలుసు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఆది, రష్మీ, నరేషల్ మీద బాగానే ఫోకస్ పెట్టేసినట్టున్నారు. సోషల్ మీడియాలో ఆది, రష్మీ, నరేష్‌ల గురించి వచ్చే పిచ్చి రూమర్లు, వార్తల మీద ప్రశ్నలు అడిగారు. ఒక్కో స్కిట్‌కు జబర్దస్త్ షోలో లక్షలు తీసుకుంటాడు అని యూట్యూబ్‌లో థంబ్ నెయిల్స్ కనిపిస్తుంటాయి. వాటిపై ఆదిని ప్రశ్నించింది ఇంద్రజ. దీనిపై మొదటి సారిగా నోరు విప్పుతున్నట్టుగా ఆది బిల్డప్ ఇచ్చాడు.
రష్మీకి ఓ హీరో ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చాడట..ఆ హీరో ఎవరు? అని ఇంద్రజ ప్రశ్నించింది. ఇక నిజంగానే రష్మీ ఆ హీరో ఎవరో చెబుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చింది. నరేష్ తనకున్న లోపం మీద వైద్యుడ్ని సంప్రదిస్తే ఏమన్నాడో తెలుసా? అంటూ ఓ థంబ్ నెయిల్‌ను చూపించి.. దాని మీద నరేష్‌ను అభిప్రాయం అడిగారు. ఇక నరేష్ ఓ రేంజ్లో రెచ్చిపోయాడు. డాక్టర్ వద్దకు వెళ్తే ఏం అన్నాడంటే.. అంటూ ఇలా ఏదో కాంటవర్రీ క్రియేట్ చేసేలా ప్రోమోను కట్ చేశారు.
కానీ ఇలాంటివి ఆడియెన్స్ ఇది వరకు ఎన్నెన్నో చూశారు. దీంతో జనాలు మల్లెమాలను, శ్రీదేవీ డ్రామా కంపెనీ మీద కౌంటర్లు వేస్తున్నారు. ప్రోమో లాస్ట్ లో ఉన్న కంటెంట్ వంద శాతం "ప్రోమో స్టంటే".. ఒక్కొక్కరు ఆస్కార్ లెవెల్ పర్ఫామెన్స్ ఇచ్చారంటూ ఇలా సెటైర్లు వేస్తున్నారు.
Also Read : Bigg Boss Keerthi : ఇంకా తత్త్వం బోధపడనట్టుందిగా.. శ్రీహాన్ అతికి మూల్యం తప్పదు.. కీర్తి విషయంలో మారని సత్య
Also Read : Ramya Krishnan Latest Photoshoot : రమ్యకృష్ణలోని హాట్ యాంగిల్.. హీటు పెంచుతోన్న నాటి సీనియర్ హీరోయిన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook