Nagarjuna: సమంత, అక్కినేని నాగ చైతన్య విడాకులపై స్పందించినట్లు.. తన పేరుతో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అక్కినేని నాగార్జున ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇవాళ తన పేరుతో వచ్చిన ఆ వార్తలన్ని తప్పుడు (Samantha Naga chaitanya divorce) వార్తలు, అసంబద్ధమైనవి పేర్కొన్నారు.
'రూమర్లను న్యూస్‌గా పోస్ట్ చేయొద్దని మీడియా మిత్రులను కోరుతున్నా' అంటూ ట్వీట్ చేశారు నాగార్జున. GiveNewsNotRumours అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జోడించారు.
The news in social media and electronic media quoting my statement about Samantha & Nagachaitanya is completely false and absolute nonsense!!
I request media friends to please refrain from posting rumours as news. #GiveNewsNotRumours— Nagarjuna Akkineni (@iamnagarjuna) January 27, 2022
అసలేమైందంటే...?
టాలీవుడ్ లవ్ కపుల్ నాగచైతన్య, సమంత (Naga chaitanya and samantha) గతేడాది అక్టోబరులో విడిపోతున్నామంటూ అధికారికంగా ప్రకటించి షాకిచ్చారు. ఈ ప్రకటన తర్వాత వారు విడిపోవడానికి కారణమిదేనంటూ అనేక వార్తలొచ్చాయి. అయితే దీనిపై నాగచైతన్య, సమంత ఎప్పుడూ అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు.
నాగార్జున కూడా వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని చెప్పారే గానీ.. వారు విడిపోవడానికి కారణాలపై మాట్లాడలేదు. అయితే తాజాగా నాగార్జున ఈ విషయంపై స్పందించాలని వార్తలు వచ్చాయి.
'సమంతనే ముందుగా విడిపోవాలని కోరుకుందని.. నాగ చైతన్య సమంత నిర్ణయాన్ని గౌరవించాడని నాగార్జున చెప్పారు.' అనేది తాజా వార్తల (Nagarjuna on Naga chaitanya Samantha divorce) సారాంశం.
నేడు ఈ వార్త వైరల్‌గా మారడంతో.. నాగార్జున ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటన చేశారు. తాను ఎలాంటి విషయాలు వెల్లడించలేదని క్లారిటీ ఇచ్చారు.
Also read: Shruti Hassan Photos: ప్రకృతిలో సలార్ భామ శ్రుతిహాసన్ ఫొటోషూట్
Also read: Akhanda Dubbed Release Date: మరో నాలుగు భాషల్లో సత్తా చాటేందుకు సిద్ధమైన అఖండ మూవీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook