Dasara Pre Release Business: దుమ్మురేపిన నాని దసరా ప్రీ రిలీజ్ బిజినెస్.. ఎన్ని కోట్లకు అమ్ముడు పోయిందంటే..?

Dasara Worldwide Pre Release Business: నాని హీరోగా నటించిన తాజా చిత్రం దసరా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత మేరకు జరిగింది ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తే నాని సినిమా సేఫ్ అవుతుంది అనే విషయం మీద ఒకసారి లుక్ వేసే ప్రయత్నం చేద్దాం.

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 28, 2023, 03:06 PM IST
Dasara Pre Release Business: దుమ్మురేపిన నాని దసరా ప్రీ రిలీజ్ బిజినెస్.. ఎన్ని కోట్లకు అమ్ముడు పోయిందంటే..?

Nani’s Dasara Worldwide Theatrical Business: నాని హీరోగా నటించిన తాజా చిత్రం దసరా. మునుపెన్నడూ నాని కనిపించని డీ గ్లామర్ రోల్ లో ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఒక తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో ఈ సినిమా మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తెలంగాణలో ఉండే సింగరేణి నేపథ్యంలోని గోదావరిఖని బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందింది. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నారు.

నాని హీరోగా రూపొంది విడుదలవుతున్న మొట్టమొదటి ప్యాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా నాని చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే నార్త్ సహా సౌత్ లోని ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి సినిమాను ప్రమోట్ చేసుకుని వచ్చారు. నాని ప్రస్తుతానికి తెలుగు మీడియాలో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. కచ్చితంగా ఇతర భాష ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఆదరిస్తారని నమ్ముతున్న నాని ఎక్కువగా ప్రమోషన్స్ ఏదైనా దృష్టి పెట్టారు.

కచ్చితంగా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ వస్తుందని సినిమా ధియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడతారని నాని అంచనాలు వేసుకుంటున్నాడు. అయితే ఈ సందర్భంగా నాని దసరా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత మేరకు జరిగింది ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తే నాని సినిమా సేఫ్ అవుతుంది అనే విషయం మీద ఒకసారి లుక్ వేసే ప్రయత్నం చేద్దాం. నాని హీరోగా నటించిన ఈ సినిమా నైజాం ప్రాంతం నేపథ్యంలోనే తెరకెక్కడంతో ఈ సినిమా నైజాం ప్రాంతంలో అత్యధిక రేటుకు అమ్ముడు పోయింది. 14 కోట్ల రూపాయలకి ఈ సినిమా హక్కులు నైజాం ప్రాంతం డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కున్నారు.

ఇక ఉత్తరాంధ్ర మూడు కోట్ల 90 లక్షలు, ఈస్ట్ గోదావరి రెండు కోట్ల 30 లక్షలు, వెస్ట్ గోదావరి రెండు కోట్లు, గుంటూరు మూడు కోట్లు, కృష్ణా రెండు కోట్లు నెల్లూరు కోటి 30 లక్షలు వెరసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో 35 కోట్ల రూపాయల మేర ఈ సినిమా హక్కులు అమ్ముడయ్యాయి. ఇక మిగతా భారతదేశం అంతా కలిపి మూడు కోట్లకు అమ్ముడుపోతే ఓవర్సీస్ లో ఆరు కోట్లకు ఈ సినిమా హక్కుల అమ్ముడయ్యాయి. మొత్తం మీద ఈ సినిమా 44 కోట్ల థియేటర్ బిజినెస్ జరుపుకుంది. ఈ సినిమా 45 కోట్లు వసూలు చేస్తే హిట్టుగా పరిగణించబడుతుంది. మరి చూడాలి నాని సినిమా ఎంతవరకు వసూళ్లు సాధించి నానీని నిలబెడుతుంది అనేది. 
Also Read: Mallareddy Pawan kalyan Offer: పవన్ కళ్యాణ్ విలన్ గా మల్లారెడ్డి.. జస్ట్ లో మిస్ అయిందట?

Also Read: Das Ka Dhamki Break Even: నాలుగురోజుల్లోనే దాస్ కా ధమ్కీ బ్రేక్ ఈవెన్.. విష్వక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News