Radhe Shyam Release Date: ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా అనేక దేశాలు ఆంక్షల్లోకి జారుకుంటున్నాయి. ప్రజలందరూ ఇంటికే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అటు మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతంలోకి కొన్ని రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూని విధించాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో విడుదల కావాల్సిన చిత్రాలు వాయిదా పడుతున్నాయి. ముంబయిలో కరోనా ఆంక్షలు వచ్చిన నేపథ్యంలో డిసెంబరు 31న విడుదల కావాల్సిన 'జెర్సీ' రీమేక్ నూ నిర్మాతలు వాయిదా వేశారు.
దీంతో సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన పాన్ ఇండియా చిత్రాలైన 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' విడుదల వాయిదా తప్పదని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. జనవరి 7న విడుదల కానున్న రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా వేయకతప్పదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'రాధేశ్యామ్' కూడా వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతుంది.
ఈ క్రమంలో చిత్రబృందం విడుదల చేసిన ఓ పోస్టర్ ఆ రూమర్లకు సమాధానం చెప్పినట్లైంది. న్యూ ఇయర్ కానుకగా షేర్ చేసిన కొత్త పోస్టర్లో జనవరి 14 అని రిలీజ్ డేట్ ఉంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందపడిపోతున్నారు. మరి పోస్టర్లో చెప్పినట్లు అదే రోజు రిలీజ్ చేస్తారా? లేక ఏమైనా వాయిదా పడుతుందా అనేది చూడాలి.
This New Year Witness the Biggest war between Love & Destiny 💕🚢 from #RadheShyam #HappyNewYear2022
Starring #Prabhas & @hegdepooja@director_radhaa #BhushanKumar @TSeries @UV_Creations @GopiKrishnaMvs @AAFilmsIndia pic.twitter.com/Y58RMMApJA
— Radhe Shyam (@RadheShyamFilm) January 1, 2022
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం సహా ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో రిలీజ్ కానుంది. కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేస్తుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో 50 శాతం సామర్థంతో ప్రేక్షకుల్ని అనుమతిస్తున్నారు.
Also Read: Sivakarthikeyan: 'జాతిరత్నాలు' డైరెక్టర్‌తో శివ కార్తికేయన్ తెలుగు సినిమా!
Also Read: Bangarraju Teaser: ఊరుకోవే పుటికి.. కితకితలెడుతున్నాయే! నువ్ దేశానికే సర్పంచ్ కావాలె
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి