Ram Charan: శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మూవీ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో ‘ఆర్సీ 16’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగుతోంది. ఇప్పటికే మైసూర్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. మరోవైపు ఏపీలో పల్లెలో ఈ సినిమా షూట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్లో కూతురుతో కలిసి సందడి చేశారు రామ్ చరణ్. ఇక చరణ్ తాను షూటింగ్ చేస్తోన్న ప్రదేశానికి తొలిసారి కూతురు క్లీంకారాను తీసుకు రావడం విశేషం. దానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాన్ని మెగా ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ టైటిల్ పై పెద్దగా బజ్ లేకపోవడంతో మరో టైటిల్ పెట్టే యోచనలో చిత్ర యూనిట్ ఉంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అతిలోకసుందరి శ్రీదేవి కూతరు జాన్వీ కపూర్ నటిస్తోంది. తెలుగులో జాన్వీకి ఇది రెండో చిత్రం.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’ మూవీ విషయానికొస్తే.. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూడు భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 108 కోట్ల షేర్ (రూ. 205 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ తొలిసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. తండ్రి అప్పన్న పాత్రతో పాటు ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అయిన రామ్ నందన్ పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే కదా.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.