రేవంత్‌ను పొగుడ్తూ వర్మ సంచలన పోస్టు

Last Updated : Oct 30, 2017, 05:34 PM IST
రేవంత్‌ను పొగుడ్తూ వర్మ  సంచలన పోస్టు

ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డిపై రాంగోపాల్ వర్మ ప్రసంశల జల్లు కురిపించాడు. యువ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు బాహుబలి లాంటివాడని..ఆయన చేరికతో కాంగ్రెస్ కు ఓట్ల వర్షం కుపిస్తుందని కొనియాడుతూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు చేశాడు. 

"రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం నాకు చాలా చాలా హ్యాపీ. రేవంత్ రెడ్డి చేరటం మూలాన నాకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళి నమ్మకం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి 'బాహుబలి'. 'బాహుబలి' బాక్సాఫీస్ కి నోట్ల వర్షం కురిపిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి ఓట్ల వర్షం కురిపిస్తాడు" అని వ్యాఖ్యానించాడు. ఆయన చేసిన పోస్టు యథాతథంగా చదవండి...

 <

>

రాంగోపాల్ వర్మ చేసిన ఈ అసక్తికర పోస్టుకు నిమిషాల వ్యవధిలో వందలాది లైకులు వచ్చాయి. ఇప్పటికే రాంగోపాల్ వర్మ చేస్తున్న ఎన్టీఆర్ లక్ష్మీస్ టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా తెరకెక్కుతుందనే ప్రచారం నడుస్తోంది. ఇదే అంశంపై వర్మకు, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ టీడీపీకి గుడ్ బై చెప్పిన రేవంత్ రెడ్డిపై ప్రసంశించి టీడీపీ నేతలకు ' పుండుమీద కారం' చల్లే విధంగా ప్రవర్తించడం గమనార్హం.

Trending News