RC 15 Vs Indian 2: ఈసారి మరో రికార్డు బద్దలవ్వనుందా? అదే జరిగితే పరిస్థితి ఏంటి?

RC 15 - Indian 2 to Release for Sankranthi 2024: శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతానికి రెండు బడా సినిమాలు తెరకేక్కుతున్నాయి, ఈ రెండు సినిమాలు సంక్రాంతి టార్గెట్ గా రంగంలోకి దిగడం చర్చనీయాంశం అవుతోంది.

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 26, 2023, 11:07 PM IST
RC 15 Vs Indian 2: ఈసారి మరో రికార్డు బద్దలవ్వనుందా? అదే జరిగితే పరిస్థితి ఏంటి?

Shankar RC 15 - Indian 2 to Release for Sankranthi 2024: తెలుగు సినీ చరిత్రలో మునుపెన్నడూ కనివిని ఎరుగని ఒక ఘటనని మనం అబ్జర్వ్ చేసాం. అదేమిటంటే మైత్రి మూవీ మేకర్ సంస్థ తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన రెండు పెద్ద సినిమాలను ఒకేరోజు వ్యవధిలో సంక్రాంతి సీజన్ కి విడుదల చేయటం. ఇప్పటివరకు ఏ నిర్మాణ సంస్థ కూడా ఇలాంటి సాహసానికి ఒడిగట్టలేదు.  కానీ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఒకే సంక్రాంతికి తమ రెండు బడా ప్రాజెక్టులను రిలీజ్ చేసింది.

ముందుగా 12వ తేదీన వీర సింహారెడ్డి రిలీజ్ అయితే 13వ తేదీన వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయింది. వీర సింహారెడ్డి కంటే వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ విషయంలో ముందుకు దూసుకుపోయింది అనుకోండి అది వేరే విషయం. ఇక తాజాగా ఇలాంటి పరిణామమే మరొకటి చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అదేమిటంటే ప్రస్తుతానికి శంకర్ దర్శకత్వంలో రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ముందుగా శంకర్ ఇండియన్ 2 అనే ఒక సినిమా ప్రారంభించారు.

ఆ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగా ఒక పెద్ద ప్రమాదం జరగడంతో కొంతమంది స్టాఫ్ కూడా చనిపోయారు. దీంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది, మళ్ళీ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలి డానికి కమలహాసన్ ఆసక్తి చూపించక పోవడంతో చాలా కాలం వేచి ఉన్న శంకర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ 15వ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు రామ్ చరణ్ 15వ సినిమాని దిల్ రాజు సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఇండియన్ టు సినిమాని రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు బడా సినిమాలే కావడం రెండు ప్యాన్ ఇండియన్ సబ్జెక్టులే కావడంతో ఏదో ఒక సినిమాని వెనక్కి తగ్గేలా చేస్తారని అనుకుంటున్నారు. ఇక ఒక వేళ అలా చేయడం గనక విఫలమైతే మరో  చరిత్ర సృష్టించడం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఏం జరగబోతుంది అనేది కాలమే నిర్ణయించాలి మరి.
Also Read: Anchor Shyamala on Ram Charan: రామ్ చరణ్‌ను చూసి ఈర్ష్యనా? లేక ఇది జెలసీ వల్ల వచ్చిన మౌనమా?

Also Read: K Vishwanath Wife Died:కె విశ్వనాద్ ఇంట తీవ్ర విషాదం.. అదే వార్డులో ఆయన భార్య కన్నుమూత!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News