Telugu Cinema Birthday Awards: ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన తెలుగు సినిమా పుట్టిన రోజు ఎప్పుడో ప్రేక్షకులకు తెలియదు. ఇతర భాషల ప్రేక్షకులే కాదు సొంత తెలుగు వారికి కూడా అంతగా తెలియదు. అసలు అది ఒకరోజు ఉందా? అనే సందేహం వ్యక్తమవుతోంది. తెలుగు సినిమాకు పుట్టినరోజు ఒకటి ఉంది. ప్రతియేటా ఫిబ్రవరి 6వ తేదీన తెలుగు సినిమా జన్మదినాన్ని నిర్వహిస్తారు. మద్రాసులో పుట్టి తెలుగు నేలపై అడుగుపెట్టిన తెలుగు సినిమాకు ఇకపై ప్రేతి యేటా ఫిబ్రవరి 6వ తేదీన అంగరంగ వైభవంగా సంబరాలు నిర్వహించాలని సినిమా సంస్థలు నిర్ణయించాయి. సంబరాల్లో భాగంగా ఒక జెండా ఆవిష్కరించాలని.. అవార్డులు కూడా ఇవ్వాలని కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ చేసిన కీలక ప్రకటన ఆసక్తికరంగా ఉంది.
Also Read: Upasana Konidela: పవన్ కల్యాణ్ కోడలు సంచలన నిర్ణయం.. పిఠాపురం నుంచే 'ఆ పనికి' శ్రీకారం
హైదరాబాద్‌లో గురువారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సమావేశమైంది. ఫిబ్రవరి 6వ తేదీ తెలుగు సినిమా పుట్టినరోజు కావడంతో గురువారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ చాంబర్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం నంది అవార్డుల మాదిరి ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని తెలుగు ఫిల్మ్ చాంబర్ నిర్ణయించింది. ఫిబ్రవరి 6 తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.
ప్రభుత్వం ఇచ్చే అవార్డులతోపాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఉంటాయని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పేర్కొంది. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి సినిమా నటుడు ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని సమావేశంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న తెలుగు సినిమాకు ఒక పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించేందుకు సినీ సంస్థలు ముందుకువస్తున్నాయి. అందులో భాగంగానే ఫిల్మ్ చాంబర్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు భాషలో భక్త ప్రహ్లాద మొట్టమొదట విడుదలైన సినిమా రోజును తెలుగు సినిమా పుట్టినరోజుగా చేసుకుంటున్నారు. 6వ తేదీ ఫిబ్రవరి 1932న భక్త ప్రహ్లాద విడుదలైంది. ఈ సందర్భంగా తెలుగు సినిమా సంబరాలు నిర్వహిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter