Kalasa Movie: బిగ్‌బాస్ భాను శ్రీ 'కలశ' మూవీ ఆడియన్స్‌ను భయపెట్టిందా..? ఎలా ఉందంటే..?

Kalasa Movie Review and Rating: సైకలాజికల్‌ థ్రిల్లర్, హారర్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొండా రాంబాబు డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ కలశ. శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ఆడియన్స్‌ను భయపెట్టిందా..? ఎవరు ఎలా నటించారు..? పూర్తి వివరాలు రివ్యూలో చూద్దాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2023, 08:10 PM IST
Kalasa Movie: బిగ్‌బాస్ భాను శ్రీ 'కలశ' మూవీ ఆడియన్స్‌ను భయపెట్టిందా..? ఎలా ఉందంటే..?

Kalasa Movie Review and Rating: బిగ్ బాస్ భామ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ కలశ. కొండా రాంబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై డాక్టర్ రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మించారు. థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా నేడు (డిసెంబర్ 15న) ఆడియన్స్‌ ముందుకు వచ్చింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పార్స్ రావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను అందుకుందా..? థ్రిల్టర్ సబ్జెక్ట్ మెప్పించిందా..? రివ్యూలోకి వెళదాం..

స్టోరీ ఏంటంటే..?

హర్రర్ సినిమాను తీయాలని తన్వి (భానుశ్రీ) ఓ కథను రాసుకుని.. ఓ ప్రొడ్యూసర్‌ను కలుస్తుంది. అతనికి మొత్తం స్టోరీని చెప్పగా.. క్లైమాక్స్‌లో మార్పులు చేయాలని తన్వికి చెప్తాడు. దీంతో తన్వి హైదరాబాద్‌లో ఉన్న తన ఫ్రెండ్ కలశ (సోనాక్షి వర్మ) ఇంటికి వస్తుంది. కలశకు ఫోన్ చేయగా.. బయటకు వెళ్లానని చెబుతుంది. తన్వి ఇంట్లో ఉండగా.. ఆ ఇల్లు తాను కథలో రాసుకున్న ఇల్లు మాదిరే ఉంటుంది. తాను కథలో రాసుకున్న సీన్లు.. తన్వి కళ్ల ముందే జరుగుతుంటాయి.

ఆ ఇంట్లో తనకు తెలియకుండా ఎవరో తిరుగుతున్నట్లు తన్వి అనుకుంటుంది. తనను కలశ చెల్లి అన్షు (రోషిణి కామిశెట్టి) ఆట పట్టిస్తుందని అనుకుంటుంది. నెక్ట్స్ డే తన్వికి షాకింగ్ నిజం తెలుస్తుంది. కలశ, ఆమె చెల్లెలు అన్షు రెండు నెలల క్రితమే చనిపోయినట్లు ఆ ఇంటి పని మనిషి చెబుతాడు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరూ ఉండడం లేదంటాడు. దీంతో తన్వి పూర్తిగా సందిగ్ధంలో పడిపోతుంది. తన్వికి కాల్ చేసింది ఎవరు..? కలశ, అంజు ఎలా చనిపోయారు..? కలశ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? రైటర్ రచయిత రాహుల్‌ (అనురాగ్‌)కు ఈ హత్యలకు లింక్ ఏంటి..? సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మానస హత్యకు ఈ కేసులో ఉన్న సంబంధం ఏంటి..? సస్పెండ్ అయిన CI కార్తికేయ (రవివర్మ) ఈ కేసు గురించి ఎందుకు సీక్రెట్‌గా తెలుసుకుంటాడు..? కార్తికేయకు తన్వి ఎలాంటి సహాయం చేసింది..? చివరకు ఏం జరిగింది..? అనేది తెలియాలంటే తప్పకుండా కలశ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ

సైకలాజికల్‌ థ్రిల్లర్, హారర్‌ బ్యాక్‌డ్రాప్‌లో డైరెక్టర్‌ కథ రాసుకున్నాడు. పాయింట్ కొత్తగా రాసుకుని.. తెరపై చూపించడంతో కొంతవరకు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. తెరపై దాన్ని ఆసక్తికరంగా చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. అసలు పాయింట్‌ను దాచిపెడుతూ.. మొదటి భాగంలో కథను అలా నడిపిస్తూ వచ్చాడు. ఫస్టాఫ్‌లో ఎక్కువగా కామెడీని పండించాడు. రచ్చ రవి, భానుశ్రీల మధ్య వచ్చే కామెడీ సీన్లు ఆడియన్స్‌ను నవ్విస్తాయి. కానిస్టేబుల్‌ నారాయణ, ఆయన కూతురు మానసల మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. ఇంట్లో దెయ్యాలు చేస్తున్న పనులు అక్కడక్కడ సిల్లీగా అనిపించినా.. కొన్ని చోట్ల మాత్రం భయపెడతాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి క్రియేట్ అవుతుంది.
 
సెకండాఫ్‌లో కథ స్పీడ్ అందుకుంటుంది. కలశ బ్యాక్‌గ్రౌండ్, అక్కాచెల్లెళ్ల మరణాలకు కారణాలు ఊహించని విధంగా ఉంటాయి. కార్తికేయ విచారణలో ట్విస్టులు థ్రిల్‌కు గురిచేస్తాయి. క్లైమాక్స్ ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు డైరెక్టర్. ప్రథమార్ధంలో కథను మరింత బలంగా రాసుకొని ఉంటే మూవీ రిజల్ట్ మరోలా ఉండేది. హారర్‌ జానర్స్‌ని ఇష్టపడేవారికి కలశ మూవీ తప్పుకుండా నచ్చుతుంది. 

ఎవరు ఎలా నటించారంటే..?

బిగ్‌బాస్‌ ఫేమ్‌ భానుశ్రీకి చాలా రోజుల తరువాత ఓ మంచి రోల్ పోషించింది. సినిమాలో దర్శకురాలిగా తెరపై ఆకట్టుకుంది. అవసరమైన చోట అందాలను ఆరబోస్తూనే.. చక్క నటించింది. టైటిల్‌ రోల్‌లో సోనాక్షి వర్మ మెప్పించింది. అన్షు పాత్రలో రోషిణి కామిశెట్టి, పోలీస్ అధికారిగా కార్తికేయగా రవివర్మ, నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న సీఐగా సమీర్‌, సినిమా రచయిత రాహుల్‌గా అనురాగ్‌తో ఇతర నటీనటులు తమ పాత్రల్లో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. 

సాంకేతిక పరంగా ఈ సినిమా చాలా రిచ్‌గా అనిపిస్తుంది. విజయ్‌ కురాకుల బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో ఆడియన్స్‌ను భయపెడుతుంది. వెంకట్‌ గంగధారి సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్టిస్ట్‌గా.. గాయనిగా.. నర్తకిగా వివిధ రంగాలలో పేరు, ప్రఖ్యాతుల సంపాదించుకున్న రాజేశ్వరి చంద్రజ ఈ మూవీతో ప్రొడ్యూసర్‌గా మారారు. తొలి సినిమాతోనే ఎంతో అభిరుచి గల నిర్మాతగా అని నిరూపించుకున్నారు. ఖర్చుకు ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఉన్నతంగా నిర్మించారు. 

రేటింగ్: 2.5
 

Also Read:  Bank Alerts: డిసెంబర్ 31లోగా బ్యాంకుకు వెళ్లి ఈ పని పూర్తి చేయకుంటే ఇబ్బందులు తప్పవు

Also Read: KCR Discharge: కోలుకున్న కేసీఆర్, యశోద ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News