Cervical Pain Tips: స్పాండిలైటిస్ సర్వైకల్ నొప్పి నరకంగా మారిందా, ఈ 3 చిట్కాలు పాటిస్తే చాలు

Cervical Pain Tips: ఆదునిక జీవన విధానంలో ఎదురౌతున్న వివిధ రకాల సమస్యల్లో ప్రదానమైంది సర్వైకల్ నొప్పి. తీవ్రమైన మెడ నొప్పి. ఈ సమస్య ఎంత సాధారణంగా కన్పిస్తుందో అంతే నరకప్రాయమైంది. కొన్ని సులభమైన చిట్కాలతో ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 23, 2024, 06:18 PM IST
Cervical Pain Tips: స్పాండిలైటిస్ సర్వైకల్ నొప్పి నరకంగా మారిందా, ఈ 3 చిట్కాలు పాటిస్తే చాలు

Cervical Pain Tips: సర్వైకల్ స్పోండిలైటిస్ కారణంగా మెడలో తీవ్రమైన నొప్పి ఒక్కోసారి తల తిరగడం సంభవిస్తుంటుంది. ఆధునిక జీవన విధానంలో ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తోంది. సర్వైకల్ స్పయన్ బలహీనం కావడంతో ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు జీవితం నరకప్రాయంగా కన్పిస్తుంది. 

ఆధునిక జీవన విధానంలో గంటల తరబడి ఒకేచోట కూర్చుని చేసే ఉద్యోగాలు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో స్పాండిలైటిస్ లేదా సర్వైకల్ పెయిన్ తీవ్రంగా భాదిస్తుంటోంది. ఒకసారి ఈ సమస్య వచ్చిందంటే నరకప్రాయంగా మారుతుంది. ఈ నొప్పిని భరించడం కష్టమైపోతుంటుంది. కొన్ని సులభమైన వ్యాయామ చిట్కాలతో సర్వైకల్ స్పాండిలైటిస్ నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. 

నెక్ టిల్ట్ ఎక్సర్‌సైజ్

నేరుగా కూర్చుని మెడను ఓ వైపుకు వంచాలి. మీ చెవి భుజానికి తగిలేంతవరకూ వంచాలి. ఓ 5-7 సెకన్లు అలానే ఉండి తిరిగి సాధారణ స్థితికి రావాలి. ఇప్పుడు రెండోవైపుకు అలానే వంచి 5-7 సెకన్లు ఉండాలి. మళ్లీ సాధారణ స్థితికి వచ్చేయాలి. ఇలా 5-6 సార్లు చేయాలి. 

నెక్ స్ట్రెచ్ ఎక్సర్‌సైజ్

ముందుగా శరీరాన్ని నిటారుగా ఉంచి కూర్చోవాలి. ఇప్పుడు మీ గెడ్డం భాగాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఎంతవరకంటే మీ మెడ లాగినట్టన్పించేంతవరకూ. ఇలా 5 సెకన్లు ఉండాలి. తరువాత సామాన్య స్థితికి రావాలి. ఆ తరువాత మెడను వెనక్కి వంచి మరో 5-6 సెకన్లు ఉంచాలి. ఇలా 5-6 సార్లు చేయాలి.

నెక్ ఎక్సర్‌సైజ్

మీ నడుమును నిటారుగా ఉంటి కూర్చోవాలి. మీ గెడ్డం భాగాన్ని దిగువకు వంచాలి. మీ ఛాతీకి టచ్ అయ్యేంతవరకూ చేయాలి. ఇలా 5 సెకన్లు చేసి తిరికి సామాన్య స్థితికి వచ్చేయాలి. ఇలా 5 సార్లు చేయాలి. 

నెక్ టర్న్ ఎక్సర్‌సైజ్

నడుము నిటారుగా ఉంచటి కూర్చుని మెడను ఓ వైపుకు తిప్పాలి. ఎంతవరకూ వీలైతే అంతవరకూ తిప్పాలి. దాదాపు 5 సెకన్లు అలానే ఉంచి..తిరిగి మామాలుగా ఉంచాలి. ఇప్పుడు రెండోవైపుకు తిప్పాలి. ఇలా మొత్తం 360 డిగ్రీలు తిప్పేందుకు ప్రయత్నించాలి. ఇలా 5-6 సార్లు చేస్తే మంచి ఫలితాలుంటాయి. 

Also read: Parkinsons Disease: పార్కిన్సన్స్ వ్యాధి గురించి మీకు తెలియని నిజాలు, అవాస్తవాలు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News