Foods Should Never Refrigerate: ప్రస్తుతం చాలా మంది చల్లని ఉష్ణోగ్రతలు ఉన్న ఆహార పదార్థాలను సురక్షితమైనదిగా భావిస్తున్నారు. ఎందుకంటే చల్లని, గడ్డకట్టే ఉష్టోగ్రతల కారణంగా ఆహారాన్ని పాడుచేసే సూక్ష్మజీవుల కదలికలు ఆగిపోతాయి. దీని వల్ల ఆహారం ఫ్రెష్‌గా ఉంటుంది. నిత్యం చాలా మంది తరచుగా పచ్చి మాంసం, కొన్ని కూరగాయలు, ఆహారాలను తక్కువ ఉష్ణోగ్రత కోసం ఫ్రిజ్‌లో ఉంచుతారు. అయితే కొన్ని వస్తువులను చల్లని ప్రదేశాల్లో ఉంచడం వల్ల అవి చెడిపోకుండా ఉంటే.. మరి కొన్ని చెడి పోతున్నాయి. అంతేకాకుండా మరి కొన్ని విషపూరితంగా మారుతున్నాయి. కావున కొన్ని రకాల ఆహారాలను అస్సుల గడ్డకట్టే ఉష్ణోగ్రత వద్ద ఉంచకూడదని నిపుణులు భావిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ నియమాలను తప్పకుండా పాటించాలి:
1. టమోటాలను ఎప్పుడు కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడదు. వీటిని గదిలో ఉష్ణోగ్రతల మధ్య మాత్రమే ఉంచాలి. ఇలా చేయడ వల్ల కూరల్లో వీటిని వినియోగించినప్పుడు రుచి పోకుండా ఉంటుంది. టమోటాలను చల్ల ఉష్ణోగ్రతల్లో ఉంచడం వల్ల రుచి తొలగిపోయే అవకాలుంటాయి. ఒక వేళా వీటిని ఫ్రిజ్‌లో ఉంచిన వల్ల వండుకునే గంట ముందు బయట తీసి ఉంచాలి.
2. ప్రస్తుతం చాలా మంది ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెడుతున్నారు. ఇలా చేయడం వల్ల అవి తొందరగా చెడిపోయే అవకాశాలుంటాయి. అయితే ఎప్పుడూ పై తొక్క లేని ఉల్లిపాయలను తక్కువ ఉష్ణోగ్రత మధ్య ఉంచకూడదు.
3. నిత్యం వంటకాల్లో వినియోగించే గింజలను కూడా చాలా మంది ఫ్రిజ్‌లో పెట్టుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వాటిలో ఉండే సువాసనలు, రుచి తొలగిపోతాయి. అంతేకాకుండా శరీరానికి అందాల్సిన పోషకాలు కూడా తొలగిపోతాయి.
4. వంటకాలకు రుచిని కలిగించే వాటిల్లో వెల్లుల్లి ఒకటి. ప్రస్తుతం దీనిని కూడా చాలా మంది ఫ్రిజ్‌లో తక్కువ ఉష్ణోగ్రత మధ్య ఉంచుతున్నారు. ఇలా చేయడం వల్ల అవి మొలకెత్తి, ఓ ప్లాస్టిక్ రబ్బర్‌లా తయారవుతున్నాయి. అంతేకాకుండా ఆ తర్వాత వీటిని బయట సాధరణ ఉష్ణోగ్రతల వద్ద ఉంచడం వల్ల చెడిపోతున్నాయి. కావున సాధరణ ఉష్ణోగ్రత మధ్య ఉంచడం మంచిది.
5. బంగాళదుంపలను కూడా చాలా మంది ఫ్రిజ్‌లో ఉంచుతున్నారు. ఇలా చేయడం వల్ల దుంపలోని పిండిని పదార్థాలు చక్కెరగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా తేమ వల్ల చెడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కావున వీటి సాధరణ ఉష్ణోగ్రతల మధ్య ఉంచడం మంచిది.
6. తేనెలో అనేక రకాల ఔషధ మూలకాలుంటాయి. కావున దీనిని ఫ్రిజ్‌లో ఉంచాల్సిన అవసరం లేదని నిపుణులు తెలుపుతున్నారు. దీనిని బయట ఉష్ణోగ్రత వద్ద ఉంచడం వల్ల స్మూత్ గా, ఫ్రెష్ గా ఉంటుంది. అయితే దీనిని తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచితే చెడిపోయే అవకాశం ఉంటుంది.
Read also: Paratha Recipe: ఉదయాన్నే దీనితో చేసిన పరాటా తింటే.. రోజంతా శరీరం అక్టివే..!
Read also: Heavy Rains: కుండపోత వానలతో తెలంగాణ అతలాకుతలం.. గోదావరిలో ప్రమాదకరంగా నీటిమట్టం
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook