Millets Side Effects: చిరుధాన్యాలను ఈ వ్యాధిగ్రస్తులు తింటే అంతే సంగతి..!!

Who Should Avoid Eating Millets: చిరుధాన్యాలు ఆరోగ్యానికి గొప్ప ఆహారం. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో సహాయపడుతాయి. కానీ కొన్ని వ్యాధులతో బాధపడేవారు మాత్రం వీటికి దూరంగా ఉండాలి. ఎలాంటి వారు చిరుధాన్యాలను తీసుకోకుండా ఉండాలి అనేది తెలుసుకుందాం. 

Written by - Shashi Maheshwarapu | Last Updated : Aug 31, 2024, 12:18 PM IST
Millets Side Effects: చిరుధాన్యాలను ఈ వ్యాధిగ్రస్తులు తింటే అంతే సంగతి..!!

Who Should Avoid Eating Millets: ఆధునిక జీవనశైలిలో చిరుధాన్యాలు, తృణధాన్యాల గురించి పెద్దగా అవగాహన ఉండదు. కానీ ఇవి ప్రాచీన కాలం నుంచి సాగు చేస్తున్న ధాన్యాలు. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు అనారోగ్యసమస్యల బారిన పడకుండా సహాయపడుతాయి. అయితే చిరుధాన్యాలు అంటే ఏమిటి? వీటని ఎవరు తినవచ్చు ? ఎలాంటి వారు తినకుండా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం. 

చిరుధాన్యాలు అంటే కొర్రలు, రాగులు, జొన్నలు, సామలు, సజ్జలు, ఊదలు, ఉలవలు, అరికెలుఉ,ఆండూ కొర్రలు, జొన్న సజ్జలు వీటిని పిలుస్తారు. ఇవి మన తాత, ముత్తాతల కాలం నుంచి సాగు అవుతున్న పంటలు. వీటిని మనం ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల డయాబెటిస్‌, అధిక బరువు, ఊబకాయం, గ్యాస్, మలబద్ధకం, లివర్‌, గుండె సమస్యలకు చెక్‌ పెట్టడంలో ఎంతో సహాయపడుతాయి. 

ప్రస్తుతకాలంలో కొంతమంది వీటని డైట్‌ పాన్‌లో ఒక భాగంగా తీసుకుంటున్నారు. ఇందులో బీటా కెరాటిన్‌ అనే పోషకం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఉండే వ్యర్థపదార్థాలను, చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో ఉపయోగపడుతాయి.  అలాగే రోగనిరోధక శక్తిని మెరుగపరుచుతాయి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలి అనుకొనేవారు ప్రతిరోజు తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. డయాబెటిస్‌తో పాటు అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు రోజు ఒక కప్పు చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహారం తీసుకోవడం వల్ల రక్తపోటు వల్ల కలిగే ఇతర అనారోగ్యసమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. 

చిరుధాన్యాల్లో ఐరన్‌, కాల్షియం, జింక్‌, ఫైటిక్ యాసిడ్‌ , ఖనిజలు అధికంగా ఉంటాయి. ఇవి తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. అయితే చిరుధాన్యాలు ఆరోగ్యకరమైనవి అయినప్పటికి వీటిని కొంతమంది తినడకుండా ఉండాలి. ఎవరు తినకూడదు అనేది తెలుసుకోండి.

చిరుధాన్యాలు తినడం మానుకోవలసిన వారు:

అలర్జీలు ఉన్నవారు:

 కొంతమంది వ్యక్తులకు చిరుధాన్యాల పట్ల అలర్జీ ఉండవచ్చు. ఈ అలర్జీ గుర్తింపు లక్షణాలు చర్మం దురద, ఉబ్బసం, జీర్ణశయ సమస్యలు మొదలైనవి.

సెలియాక్ వ్యాధి ఉన్నవారు: 

సెలియాక్ వ్యాధి ఉన్నవారు గోధుమలు, బార్లీ వంటి గ్లూటెన్ ఉన్న ఆహారాలను తినకూడదు. కొన్ని చిరుధాన్యాలలో గ్లూటెన్ ఉండవచ్చు కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలి.

జీర్ణశయ సమస్యలు ఉన్నవారు:

 కొంతమంది వ్యక్తులకు చిరుధాన్యాలు జీర్ణం కావడం కష్టంగా ఉండవచ్చు. ఇది వాయువు, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలకు దారితీస్తుంది.

హైపర్ థైరాయిడిజం:

హైపర్ థైరాయిడిజం ఉన్నవారు చిరుధాన్యాలను తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ తినాలనిపించినా అతి తక్కువగా తీసుకోవడం మంచిది. దీని వల్ల యాంటీ థైరాయిడ్‌ లక్షణాలు పెరుగుతాయి. 

డాక్టర్ సలహా:

ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే, చిరుధాన్యాలను తినడం గురించి మీ డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

Also Read: Liver Health: నాన్ ఆల్కహాల్‌ వారికి లీవర్‌ ఎందుకు దెబ్బతింటుంది? కారణాలు ఇవే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter

Trending News