Weight Loss Breakfast: అధికబరువు సమస్యలా..? ఈ సింపుల్ బ్రేక్‌ఫాస్ట్‌లతో చెక్ పెట్టొచ్చు!

Weight Loss With 5 Breakfasts: అధిక బరువు తగ్గడానికి నానా తిప్పలు పడుతున్నారా ? బ్రేక్ ఫాస్ట్ మానేస్తే అధిక బరువు తగ్గుతారు అనుకుంటే పొరపాటే అవుతుంది. అధిక బరువు తగ్గించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేసే వారిలో కొంతమంది చేసే పొరపాటే ఇది.

Written by - Pavan | Last Updated : Apr 6, 2023, 08:36 PM IST
Weight Loss Breakfast: అధికబరువు సమస్యలా..? ఈ సింపుల్ బ్రేక్‌ఫాస్ట్‌లతో చెక్ పెట్టొచ్చు!

Weight Loss With Breakfasts: అధిక బరువు తగ్గడానికి నానా తిప్పలు పడుతున్నారా..? బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే అధిక బరువు తగ్గుతారు అనుకుంటే పొరపాటే అవుతుంది. అధిక బరువు తగ్గించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేసే వారిలో కొంతమంది చేసే పొరపాటే ఇది. కానీ బ్రేక్‌ఫాస్ట్ చేయడంలోనూ ఒక కంప్లీట్ బ్యాలెన్సింగ్ డైట్ తీసుకుంటే.. అది అధిక బరువు తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. 

అధిక బరువు తగ్గాలంటే తక్కువ ఆహారం తిని ఎక్కువసేపు ఫుల్ స్టమక్‌గా ఫీల్ అయ్యే ఫుడ్ కోసం అన్వేషిస్తుంటారు. అలా చేస్తేనే అధిక బరువు తగ్గించుకోవచ్చు అనేది చాలామంది అనుసరించే సూత్రం. అవును.. బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఆరోగ్యకరమైన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా కూడా అధిక బరువును తగ్గించుకోవచ్చు.  

చిల్లా: పెసర్లు లేక శనగ పప్పుతో చేసే చిల్లా తినడం వల్ల శరీరానికి అధిక మొత్తంలో ప్రొటీన్లు లభిస్తాయి. కండరాలకు చిల్లా మంచిది. కేలోరిలను కరిగించి, గ్లూకోస్ లెవెల్స్‌ని క్రమబద్ధీకరిస్తుంది. పైగా వీటితో చేసిన చిల్లా తినడం వల్ల త్వరగా ఆకలి వేయడం అనేది జరదగదు.

ఇడ్లీ: హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఐడియాలలో ఇడ్లీ కూడా ఒకటి. పులియబెట్టిన పిండితో చేయడం ఒక ఎత్తయితే.. కేవలం ఆవిరిపైనే ఉడకపెట్టిన ఫుడ్ కావడంతో ఇడ్లీలలో కేలరీలు తక్కువగా ఉండి, అధిక బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. ఇడ్లీలలో ఉండే ఐరన్, ఫైబర్ కంటెంట్ మధ్యాహ్నం సమయంలో ఆకలిని తగ్గిస్తుంది. పైగా ఇడ్లీలను తినడం వల్ల జీర్ణశక్తి కూడా పెంపొందుతుంది.

స్ప్రౌట్ సలాడ్: స్ప్రౌట్ సలాడ్‌లో అధిక మొత్తంలో ఫైబర్, ప్రొటీన్స్, మాంగనీస్, మెగ్నీషియం వంటి శరీరానికి మేలు చేసే న్యూట్రియెంట్స్ ఎన్నో ఉంటాయి. కట్ చేసిన ఉల్లిపాయలు, టొమాటోలు, కీరదోస, కాసింత నిమ్మరసం, చాట్ మసాలా వంటి వాటితో స్ప్రౌట్ సలాడ్‌ని మరింత టేస్టీగా మార్చుకోవచ్చు. 

అటుకులు: అటుకులతో చేసిన పోహా బ్రేక్‌ఫాస్ట్ ఐడియా ఇండియాలో ఎంతోమంది ఫైవరైట్ బ్రేక్‌ఫాస్ట్‌గా చెబుతుంటారు. పోహాలో ఉండే హెల్తీ కార్బొహైడ్రేట్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులు కాకుండా నివారిస్తుంది. చిటికెలో మీకు నచ్చిన విధంగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఐడియాలలో పోహా అన్నింటికంటే ముందుంటుంది.

కోడి గుడ్లు: ఎగ్ బుజియాగా పేరొందిన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్స్‌ పుష్కలంగా ఉంటాయి. పూదీన, కొత్తిమీర సన్నగా కత్తిరించి మీద చల్లుకుని తింటే ఆ టేస్టే వేరు.

ఇది కూడా చదవండి : Low BP Issue: లో బీపీతో బాధపడుతున్నారా ? లైట్ తీసుకోకండి

ఇది కూడా చదవండి : Side Effects Of Drinking Too Much Water: నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీలపై చెడు ప్రభావం చూపిస్తుందా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News