8th Pay Commission Salary Hike: 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతభత్యాల పెంపుకు కారణమయ్యే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎన్ని రెట్లు పెరుగుతుందనేదే ప్రధాన అంశం. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 రెట్లు పెరుగుతుందనేది అంచనా. అంటే జీతం భారీగానే పెరగవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఆఖరికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో 8వ వేతన సంఘం కమిటీ నివేదిక అందించవచ్చు. 8వ వేతన సంఘం అమల్లోకి రాగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు గణనీయంగా పెరుగుతాయంటున్నారు. ముఖ్యంగా జీతాలు 186 శాతం పెరగవచ్చని అంచనా. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం 10 నుంచి 30 శాతం పెరగవచ్చు.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది కీలకం కానుంది. ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత పెరుగుతుందనేది 2026 జనవరి 1 నాటికి ఉన్న కనీస వేతనం డియర్నెస్ అలవెన్స్ ప్రకారం నిర్ణయమౌతుంది. పిట్మెంట్ ఫ్యాక్టర్‌ను బట్టి కనీస వేతనం ఎన్ని రెట్లు పెరుగుతుందో తెలుస్తుంది. జూలై 2024 నాటికి డీఏ 53 శాతానికి చేరింది. 2026 జనవరి నాటికి మరో రెండు సార్లు డీఏ పెరగబోతోంది. ఈ రెండు సార్లు కలిపి 7 శాతం పెరగవచ్చని అంచనా. అంటే 2026 జనవరి నాటికి డీఏ 60 శాతం కావచ్చు.
కనీస వేతనం 10-30 శాతం కావచ్చని అంచనా ఉంది. 20 శాతం పెరిగితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.92 శాతం,30 శాతం పెరిగితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.08 శాతం ఉండవచ్చు. 7వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతముంది. అందుకే అప్పట్లో కనీస వేతనం 7 వేల నుంచి 18 వేలు అయింది
ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86 శాతం కావచ్చని అనుకుంటున్నారు. అదే జరిగితే కనీస వేతనం ఏకంగా 51,480 రూపాయలు అవుతుంది. కానీ అంత భారీగా జీతం పెరుగుతుందా అనేది అనుమానమే. 8వ వేతన సంఘం సిఫార్సులు 2026 జనవరి నుంచి అమల్లోకి వస్తాయి. ఎందుకంటే ఈ ఏడాది డిసెంబర్ నాటికి 7వ వేతన సంఘం గడువు పూర్తవుతుంది. అందుకే ఇప్పుడు 8వ వేతన సంఘం ఎప్పుడు అమలవుతుందా, జీతాలు ఎప్పుడెప్పుడు పెరుగుతాయా అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.
Also read: AP Housing Scheme: అందరికీ ఇళ్లు పధకానికి ఎలా అప్లై చేసుకోవాలి. అర్హులెవరు, ఏ కాగితాలు అవసరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి