100% ఎఫ్ డి ఐ లకు నిరసనగా నేడు ఢిల్లీ బంద్

వ్యాపారులకు నష్టం చేకూర్చేలా రిటైర్ రంగంలో 100% ఎఫ్ డి ఐ లకు కేంద్రం అనుమతి ఇచ్చినందుకు నిరసనగా నేడు ఢిల్లీ బంద్ కు ఆప్ పార్టీ పిలుపునిచ్చింది.

Last Updated : Jan 23, 2018, 01:18 PM IST
100% ఎఫ్ డి ఐ లకు నిరసనగా నేడు ఢిల్లీ బంద్

వ్యాపారులకు నష్టం చేకూర్చేలా రిటైర్ రంగంలో 100% ఎఫ్ డి ఐ లకు కేంద్రం అనుమతి ఇచ్చినందుకు నిరసనగా నేడు ఢిల్లీ బంద్ కు ఆప్ పార్టీ పిలుపునిచ్చింది. నిబంధనల పేరుతో ఉపాధి అవకాశాలను బీజేపీ దూరం చేస్తోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. 

వ్యాపారుల నుంచి అనేక చార్జీల పేరుతో డబ్బులు తీసుకొని సరైన వసతులను వారికి కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందని తెలిపారు. విదేశీ కంపెనీలకు పూర్తిగా తలుపులు తెరిచేలా కేంద్రం 100% పెట్టుబడులకు అనుమతించిందని ఆప్ పార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్ ధ్వజమెత్తారు. బంద్ లో ఆప్ పార్టీ నేతలు, వ్యాపారులు పాల్గొంటారని వెల్లడించారు.

Trending News