Akhilesh Yadav Refuses tea offered at UP police headquarters: సమాజ్‌వాదీ పార్టీ ట్విటర్ హ్యాండిల్ డైరెక్టర్ మనీష్ జగన్ అగర్వాల్ అరెస్ట్ తర్వాత అతన్ని విడిచిపెట్టాలని డిమాండ్ తో అఖిలేష్ యాదవ్ పోలీసు ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఆయన ఆఫీసుకు రావడం చూసి, చాలా మంది పోలీసు అధికారులు ఆయన వద్దకు చేరుకుని ఆయనకు టీ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అయితే అఖిలేష్ యాదవ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీసులు ఇచ్చే టీ తాగేందుకు నిరాకరించారు. అంతేకాక మేము ఇక్కడ టీ తాగమని పేర్కొన్న అఖిలేష్ మేము మా టీ తెచ్చుకుంటామని అన్నారు.
కావాలంటే మేము మీ కప్పులు తీసుకుంటాము కానీ మేం తాగలేమని అన్నారు. ఏమో విషం ఇస్తారేమో? మేము మిమ్మల్ని నమ్మము, మేము మా కోసం బయట నుండి ఆర్డర్ చేస్తామని అన్నారు. లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఆదివారం ఉదయం మనీష్ జగన్ అగర్వాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సమాజ్‌వాదీ పార్టీ ట్విటర్ హ్యాండిల్‌లో చేసిన అనుచిత వ్యాఖ్యలపై హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదయ్యాయి. మనీష్ జగన్ అగర్వాల్ ఎస్పీ ట్విట్టర్ ఖాతాను హ్యాండిల్ చేసేవాడని, ఆయన సీతాపూర్ నివాసి అని చెబుతున్నారు.
జనవరి 6న, లక్నోలోని బీజేపీ యువమోర్చా సోషల్ మీడియా ఇన్‌చార్జి డాక్టర్ రిచా రాజ్‌పుత్, ట్విటర్ హ్యాండిల్ సమాజ్‌వాదీ పార్టీ మీడియా సెల్ మీద అత్యాచారం, హత్య బెదిరింపులపై కేసు పెట్టారు. ఎస్పీ మీడియా కోఆర్డినేటర్ ఆశిష్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ ఉదయవీర్ సింగ్ పేర్లను కూడా మనీష్ జగన్‌పై ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఈ క్రమంలో స్వామి ప్రసాద్ మౌర్య సహా సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలందరూ డీజీపీ ప్రధాన కార్యాలయంలోని గేట్ నంబర్ 2 వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మనీష్ జగన్ అగర్వాల్‌ను విడుదల చేయాలంటూ నినాదాలు చేస్తున్న సమయంలోనే అఖిలేష్ యాదవ్ కూడా ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
అయితే ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పోలీసు హెడ్ క్వార్టర్స్‌కు చేరుకున్న సమయంలో సంబంధిత అధికారి కనిపించలేదు. దీనిపై, ఎస్పీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ట్వీట్ చేశారు, ప్రధాన కార్యాలయంలో బాధ్యతాయుతమైన వ్యక్తి ఎవరూ లేరని పేర్కొన్నారు. ఇక ఈ విషయమై ఏడీజీ ఎల్‌ఓ ప్రశాంత్‌కుమార్ మాట్లాడుతూ.. ఓ రాజకీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు తన ఎమ్మెల్యేలు కొందరితో కలిసి డీజీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారని అయితే ఆదివారం కావడంతో ప్రధాన కార్యాలయంలో అధికారులు తక్కువగా ఉన్నారని అన్నారు.
అందువల్ల, సమాచారం అందిన వెంటనే, లక్నో పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని అన్నారు. ఇక సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్ నుండి ట్వీట్లు చేసినందుకు మనీష్ జగన్ అగర్వాల్‌ను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేసును విచారించిన అనంతరం అరెస్టు చేశామని అన్నారు. ఇక గేటు వద్ద నిరసన తెలిపినా చర్యలు తీసుకుంటామన్నారు ఆయన.
Also Read: NBK Vs Chiru: బాలయ్యను చిత్తు చేసిన చిరు.. ట్రైలర్ లెక్కలు చూశారా?
Also Read: kanjhawala Case New Twist: కారు కింద అమ్మాయి పడిందని తెలుసు.. కానీ ఎందుకు ఆపలేదంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook