PM Kisan Samman Nidhi Yojana: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈసారి కీలక ప్రకటనలు చేసింది. అయితే రైతుల్లో కొన్ని అంచనాలు ఈ బడ్జెట్ అందులేకపోయింది. పీఎం కిసాన్ కార్యక్రమం కింద విస్తృతంగా ఊహించిన ఆదాయ మద్దతును ప్రభుత్వం మర్చిపోయిందనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తం అవుతోంది. బడ్జెట్‌కు ముందు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అందుకునే మొత్తాన్ని పెంచుతుందని రైతులు ఆశించారు. అయితే ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం అటువంటి ప్రకటన చేయలేదు. అలాగే పీఎం కిసాన్ కింద అందుతున్న మొత్తాన్ని పెంచలేదు. దీంతో రైతుల ఆశలు నెరవేరలేదు. పలువురు వ్యవసాయ కార్యకర్తలు మాట్లాడుతూ.. ప్రభుత్వం అగ్రిటెక్‌పైనే ఎక్కువగా దృష్టి సారించిందన్నారు.
ఈ బడ్జెట్‌లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఐదేళ్లలో అత్యల్పంగా, ప్రస్తుత సంవత్సరానికి సవరించిన అంచనాల మాదిరిగానే రూ.60 వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మొత్తాన్ని 6 వేల నుంచి 8 వేల రూపాయలకు పెంచి.. రైతులకు ఏడాదికి 4 విడతలుగా 2 వేల రూపాయల చొప్పున ఇవ్వవచ్చని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ దిశంగా ప్రభుత్వం నుంచి ప్రకటన రాలేదు.
రైతులకు మరింత లబ్ధి చేకూరే విధంగా 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు మూడు విడతలుగా రూ.2 వేలు చొప్పున సంవత్సరానికి రూ.6 వేల నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తోంది. పీఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం సుమారు 11 కోట్ల మంది రైతులకు రూ.2.2 లక్షల కోట్ల మొత్తం నగదు బదిలీ చేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో తెలిపారు.
ఇప్పటివరకు 12 విడుతలుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. త్వరలో 13వ విడుతకు సబంధించి నగదు జమ కానుంది. ఈ పథకానికి సంబంధించి మీకు ఏదైనా సమస్య తలెత్తితే హెల్ప్‌లైన్ నెంబర్ 155261 లేదా 1800115526 లేదా 011-23381092కు సంప్రదించాలి. అది కాకుండా pmkisan-ict@gov.in కు మెయిల్ చేయాల్సి ఉంటుంది.
Also Read: YSRTP: బీఆర్ఎస్‌కు షాక్.. వైఎస్‌ఆర్టీపీలోకి కీలక నేత.. ముహుర్తం ఖరారు
Also Read: Pakistan: పాకిస్థాన్‌లో వికీపీడియాపై బ్యాన్.. కారణం ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook