Pegasus Spyware: పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై కమిటీ ఏర్పాటుకు కేంద్రం సుముఖత

Pegasus Spyware: వివాదాస్పద పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై మరోసారి విచారణ ప్రారంభమైంది. పెగసస్ వ్యవహారంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు విషయమై వాదనలు జరిగాయి. కమిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 13, 2021, 04:02 PM IST
  • పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరోసారి ప్రారంభమైన విచారణ
  • ఛీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమకోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ
  • కమిటీ ఏర్పాటుకు అభ్యంతరం లేదని తెలిపిన కేంద్ర ప్రభుత్వం
Pegasus Spyware: పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై కమిటీ ఏర్పాటుకు కేంద్రం సుముఖత

Pegasus Spyware: వివాదాస్పద పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై మరోసారి విచారణ ప్రారంభమైంది. పెగసస్ వ్యవహారంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు విషయమై వాదనలు జరిగాయి. కమిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.

ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది పెగసస్ స్పైవేర్(Pegasus Spyware) వ్యవహారం. పెగసస్ స్పైవేర్‌తో దేశంలో న్యాయవాదులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు, పౌర సంఘాల నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారనేది ప్రధానంగా ఉన్న ఆరోపణ. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటీషన్లపై విచారణ గతంలోనే ప్రారంభమైంది. పెగసస్ వ్యవహారంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు అప్పట్లో సూచించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ(Justice nv ramana), జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమకోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టిది. 

ఈ సందర్భంగా పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు(Supreme Court) తెలిపింది. ఈ అంశంపై మరో అఫిడవిట్ దాఖలు చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం(Central government)ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించిందా లేదా అనేది అఫిడవిట్‌లో చర్చించే అంశం కాదని స్పష్టం చేసింది. విశాల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని అఫిడవిట్‌లో ఆ అంశాన్ని చేర్చాలని తాము అనుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వం వాదన విన్పించింది. దీనికి స్పందించిన సుప్రీంకోర్టు..దేశ భద్రత, శాంతి భద్రతల అంశాల్లోకి తాము వెళ్లడం లేదని పేర్కొంది. డిఫెన్స్ వంటి వివరాలు కూడా తాము అడగడం లేదని తెలిపింది. పెగసస్ వ్యవహారంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని..పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగిందో లేదో స్పష్టమైతే చాలని ధర్మాసనం స్పష్టం చేసింది. 

Also read: Farmer Schemes: అన్నదాతలకు మేలు చేకూర్చే 5 కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News