Covid-19 Update in Delhi Police: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తుంది. దేశంలోని కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉన్న పోలీసులు, వైద్యులుపై ఇప్పుడు కరోనా విరుచుకుపడుతోంది. సుమారు 1,700 మంది ఢిల్లీ పోలీసులు వైరస్ బారిన పడినట్లు దిల్లీ పోలీస్ శాఖ తెలిపింది.
కేవలం జనవరి 1 నుంచి 12వ తేదీ లోపే ఈ 1,700 కరోనా కేసులు వెలుగు చూసినట్లు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. సోమవారం వరకు డిపార్ట్మెంట్లో వైరస్ సోకిన వారి సంఖ్య 1,000 గా ఉండగా.. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే మరో 700 కేసులు బయటపడ్డాయి.
దీంతో సమావేశాలు అన్నీ వర్చువల్‌గా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వైరస్ సోకిన వారు హోం క్వారెంటైన్‌కు పరిమితం కావాలని అధికారులు సూచించారు.
గత పది రోజులుగా ఢిల్లీ పోలీసులు కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో ఆ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కోసం ప్రత్యేక హెల్త్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా పోలీసుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం సహా వారి ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని హెల్త్ డెస్క్ లు ఇస్తున్నాయి.
ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 21,259 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 25.65 శాతంగా నమోదైందని రాష్ట్ర ఆరోగ్య బులెటిన్ మంగళవారం వెల్లడించింది. చివరిగా గతేడాది మే 5న ఢిల్లీలో 26.36 కరోనా పాజిటివిటీ రేటు నమోదైంది.
ఢిల్లీలో ప్రస్తుతం 74,881 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గత ఎనిమిది నెలల్లో ఇవే అత్యధిక కేసులు కావడం గమనార్హం. మంగళవారం ఒక్కరోజే ఢిల్లీలో 23 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఢిల్లీ రాష్ట్రంలో ఇప్పటి వరకు 25,200 కరోనా మరణాల సంఖ్య చేరింది.
Also Read: Amarinder Singh Corona: పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్‌కు కరోనా పాజిటివ్
Also Read: I&B Ministry Twitter: కేంద్ర సమాచార, ప్రసార శాఖ ట్విట్టర్ ఖాతా హ్యాక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook