Delhi Assembly Elections Results 2025: ఢిల్లీ శాసనసభ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ సీఎం ఫేస్ లేకుండా.. కేవలం నరేంద్ర మోడీ ముఖంతోనే తోనే ఎన్నికలను ఎదుర్కొంది. గతంలో జరిగిన రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ ఫార్ములా బీజేపీకి సీఎం పీఠం దక్కేలా చేసింది. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ఫార్ములాను బీజేపీ అప్లై చేసింది. మరి ఆయా రాష్ట్రాల్లో వర్కౌట్ అయినా.. ఈ ఫార్ములా ఇపుడు ఢిల్లీ ఓటర్లను ప్రభావితం చేసి బీజేపీకి అధికారం కట్టబెట్టబోతుందా అనేది చూడాలి.
ఈ సారి బీజేపీ నరేంద్ర మోడీ ముఖంతో కాకుండా.. ఢిల్లీలో ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులను బేరీజు వేసుకొని రంగంలోకి దిగింది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల్లో ఆమ్ ఆద్మీ పార్టీకున్న సింపతీ..ఈ సారి ఆ మామ తొలిగిపోయిందా లేదా తేలాల్సి ఉంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారబోతున్నట్టు పలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఘోషించాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎగ్జాట్ పోల్ అయిన సందర్బాలు ఈ మధ్య తక్కువే అని చెప్పాలి. ఈ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
దేశంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ ఆధిపత్యానికి కళ్లం వేయాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండి’ అలయన్స్ భావిస్తోంది. ఒక వేళ బీజేపీ గెలిస్తే..ఆ కూటమి భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకుంటాయి. హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్, కొడిమో సంస్థలు కలిసి నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో ఇంట్రెస్టింగ్ విషయాలను వెలువరించాయి. . ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ల మధ్య త్రిముఖ పోటీ జరిగినా ప్రధాన పోటీ ఆప్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 10 యేళ్లకు పైగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి మోదం మిగులుస్తుందా.. ఖేదం మిగిలిస్తుందా అనేది చూడాలి. ఇక ఢిల్లీలో అధికారానికి 27 ఏళ్లు దూరంగా ఉన్న బీజేపీకి ఈ సారి గెలుస్తుందా లేకపోతే ఉసురుమనిపిస్తుందా అనేది చూడాలి.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.