నన్ను ఉగ్రవాది అనడం బాధ కలిగించింది- అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. దీంతో ఢిల్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు పోటీలు పడి మరీ ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకుంటున్నారు. ఐతే వ్యక్తిగతంగా విమర్శలకు దిగుతున్నారు. 

Last Updated : Feb 5, 2020, 11:41 AM IST
నన్ను ఉగ్రవాది అనడం బాధ కలిగించింది- అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. దీంతో ఢిల్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు పోటీలు పడి మరీ ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకుంటున్నారు. ఐతే వ్యక్తిగతంగా విమర్శలకు దిగుతున్నారు. 
 
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ వ్యక్తిగతంగా విమర్శించారు. ఆయన ఓ ఉగ్రవాది అంటూ పర్వేష్ వర్మ చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయ వేడి రగిలిస్తున్నాయి. తాజాగా పర్వేష్ వర్మ వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.  ఈ వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయన్నారు.  తాను ఎప్పుడూ దేశం కోసమే శ్రమించానని చెప్పుకొచ్చారు. తన కుటుంబం కోసం, పిల్లల కోసం ఎలాంటి పనులు చేయలేదని ..దేశం కోసమే జీవితాన్ని అంకితం చేశానని తెలిపారు. అలాంటి తనను ఉగ్రవాది అనడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. దేశంలో అవినీతిని పారదోలేందుకు రెండుసార్లు నిరాహార దీక్ష కూడా చేశానన్నారు. ఆదాయప పన్ను శాఖ కమిషనర్ గా ఉద్యోగాన్ని వదులుకున్నానని చెప్పారు. తనతోపాటు ఐఐటీ చదువుకున్న వారు 80 శాతం మంది స్నేహితులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. ఐతే తాను మాత్రం దేశాన్ని వదిలి పెట్టి వెళ్లవద్దని గట్టిగా నిర్ణయించుకున్నట్లు కేజ్రీవాల్ చెప్పుకున్నారు. .

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News