Steps to download Digital Voter ID Card in online: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఓటర్ ఐడి తప్పనిసరి అయింది. ఆన్‌లైన్‌లో ఏది అప్లై చేయాలన్నా ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడి తప్పనిసరి. ఇక ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఓటర్ ఐడి తప్పకుండా ఉండాల్సిందే. దేశంలో ఎన్నికలు రావడంతో ఓటు వేసేందుకు అర్హత కలిగిన వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారత ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆన్‌లైన్‌లో ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (ఇ-ఎపిఐసి)ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలు కల్పించింది.
ఒకవేళ ఓటర్లు ఓటర్ ఐడి కార్డు పోగొట్టుకున్నా.. వెంటనే దానిని పొందేందుకు భారత ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పిస్తోంది. ఓటర్ ఐడి కార్డులో ఏవైనా తప్పులున్నా సరి చేసుకోవచ్చు. చిరునామాను కూడా అప్‌డేట్ చేయవచ్చు. ఒకవేళ మీరు నగరం లేదా రాష్ట్రాన్ని వీడినపుడు ప్రతిసారీ కొత్త కార్డ్‌ని పొందాల్సిన అవసరం లేకుండా.. కేవలం చిరునామాను ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. మొత్తానికి ఓటర్లు డిజిటల్ ఓటర్ ఐడి కార్డును చాలా సులభంగా పొందవచ్చు.
ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే స్టెప్స్ ఇవే:
# డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://voterportal.eci.gov.in లేదా https://nvsp.in/ లోకి వెళ్లాలి.
# వెబ్‌సైట్‌లో ఎన్‌వీఎస్‌పీ (NVSP) అకౌంట్‌లోకి లాగిన్ లేదా రిజిస్టర్ కావాలి.
# ఒకవేళ అకౌంట్ లేకపోతే.. ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకుని పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయాలి.
# అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో అడిగే వివరాలను నమోదు చేయాలి. వెంటనే తర్వాత లాగిన్ ఐడీ క్రియేట్ అవుతుంది.
# లాగిన్ అయిన తర్వాత ఈపీఐసీ నెంబర్‌ను లేదా ఫామ్ రిఫరెన్స్ నెంబర్‌ను నమోదు చేసి.. రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి.
# తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓ ఓటీపీ వస్తుంది. దానిని అందులో ఎంటర్ చేయాలి.
# వెంటనే ఈ-ఈపీఐసీని డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది.
# చివరగా ఓటర్ ఐడీ పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది.
# ఈ ప్రాసెస్ మీ మొబైల్ ద్వారా కూడా సునాయాసంగా చేసుకోవచ్చు.
Also Read: IND vs WI: సరిగ్గా పరిగెత్తడం కూడా రాదా?.. టీమిండియా క్రికెటర్‌పై మండిపడిన రోహిత్ శర్మ (వీడియో)!!
Also Read: Flipkart Offers: రూ. 190లకే OPPO 5G స్మార్ట్ ఫోన్.. ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook