India Corona Cases Today: ఇండియాలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. కొత్తగా 71,365 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో వైరస్‌తో మరో 1,217 మంది మరణించారు. మరోవైపు కరోనా నుంచి 1,72,211 మంది కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.54 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,24,10,976 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 5,05,279 మంది మరణించారు. అయితే దేశంలో ప్రస్తుతం 8,92,828 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 4,10,12,869 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
India reports 71,365 fresh #COVID19 cases, 1,72,211 recoveries and 1,217 deaths in the last 24 hours.
Active cases: 8,92,828 (2.11%)
Death toll: 5,05,279
Daily positivity rate: 4.54%Total vaccination: 1,70,87,06,705 pic.twitter.com/9rtuxfM4dj
— ANI (@ANI) February 9, 2022
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 53,61,099 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,70,87,06,705కు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 26,13,318 మందికి కరోనా సోకింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగానూ కరోనా మరణాలు భారీగా పెరిగాయి. కరోనా ధాటికి 12,482 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 40,09,53,940కు చేరగా.. మరణాలు 57,82,243కు పెరిగింది.
Also Read: India corona Update: భారీగా తగ్గిన కరోనా కేసులు- 10 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook