Jai Shree ram and cricketers names in the d pharmacy answer sheet in Uttar pradesh: కొందరు ఎగ్జామ్ పేపర్ లలో ప్రశ్నలకు వింత వింత సమాధానాలు రాస్తుంటారు. తమను పాస్ చేయాలని వేడుకుంటారు. చాలా పేదవాళ్లమని, ఎలాగైన పాస్ మార్కులు వేయాలని బోర్డు ఎగ్జామ్లలో విద్యార్థులు రాసిన ఘటనలు కొకొల్లలు. కొందరు ఎగ్జామ్ ఆన్సర్ షీటన్ ను సంబంధంలేని రాతలతో నింపేస్తుంటారు. మరికొందరు.. అసలు ప్రశ్నలు ఏవున్న కూడా తమకు తెలిసిన ఆన్సర్ లు మాత్రమే రాస్తుంటారు. ముగ్గులు వేస్తుంటారు. ఎగ్జామ్ అంతాట ఏవేవోరాతలు రాస్తూ అడిషల్ మీద అడిషనల్ పేపర్లు తీసుకుంటారు. కొందరు ఎగ్జామ్ ఆన్సర్ షీట్ కు డబ్బులు కూడా కట్టి ఇస్తుంటారు. తమను పాస్ చేయకుండా,మీకు చెడు జరుగుతుందని, మీ కుటుంబంలో విషాదంజరుగుతుందని కూడా భయపెడుతుంటారు. ఎగ్జామ్ ఆన్సర్ షీట్ లో రామనామంతో నింపేస్తుంటారు. తమకు నచ్చిన పనులు చేస్తుంటారు.
Read More: Bear vs Tiger: అట్లుంటదీ మరీ.. పెద్దపులికి చుక్కలు చూపించిన ఎలుగుబంటి.. వైరల్ గా మారిన వీడియో..
ఎక్కడి నుంచి ఎగ్జామ్ లలో బండెల్ కొద్ది ఆన్సర్ షీట్ ఫుల్ చేసి ఉంటారు. దీన్ని వాల్యూవేషన్ కోసం చూసిన అధికారులకు చుక్కలు కన్పిస్తుంటాయి. ఎగ్జామ్ షీట్ లలో ముగ్గులు వేయడం, సినిమాలోన సన్నివేశాలు రాయడం, సినిమాలోని అంశాలను వివరించండం వంటి పనులుచేస్తుంటారు. ఇలాంటి వాటిని చూసిన ఇన్విజిలేటర్ లు వెంటనే తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తారు. ఈ క్రమంలో ఫార్మసీ స్టూడెంట్స్ తమ ఎగ్జామ్ పేపర్ లో.. శ్రీరామ నామాలు, క్రికెటర్ల పేర్లతో నింపేశారు. అయిన కూడా వారు 60 శాతం మార్కులతో పాస్ కావడం ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారింది.
పూర్తి వివరాలు..
ఉత్తరప్రదేశ్ యూనివర్శిటీలో డీ ఫార్మసీ మొదటి సంవత్సరం విద్యార్థులు 'జై శ్రీరామ్', క్రికెటర్ల పేర్లను సమాధాన పత్రం అంతా నింపేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వారంతా 60 శాతం మార్కులతో పాస్ అయ్యారు. పాటలు, మతపరమైన నినాదాలతో రాసిన జవాబు పత్రాలపై మార్కుల మార్పిడికి విద్యార్థుల నుండి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తొంది. జౌన్‌పూర్‌లోని వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటన ప్రస్తుతం యూపీలో తీవ్ర దుమారంగా మారింది. ఈ క్రమంలో ఇద్దరు ప్రొఫెసర్లను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
యూనివర్సిటీలోని కొందరు అధికారుల అండతో సున్నా మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా 60 శాతానికి పైగా మార్కులు ఇచ్చి ఉత్తీర్ణులయ్యారని విద్యార్థి నాయకుడు దివ్యాంశు సింగ్ ప్రధాని, ముఖ్యమంత్రి, గవర్నర్, వైస్ ఛాన్సలర్‌లకు పంపిన లేఖలో ఆరోపించారు. కొందరు విద్యార్థులు పాస్ అయిన స్టూడెంట్ల పట్ల అనుమానంతో.. ఆర్టీఐ కోసం అప్లై చేసుకున్నారు. దీంతో అధికారులు ప్రత్యేకంగా కొన్ని జిరాక్స్ కాపీలు ఇచ్చారు. దీంతో ఈ ఘనకార్యం కాస్త వెలుగులోకి వచ్చింది. ఆ స్టూడెంట్స్ ఎగ్జామ్ లలో చేసిన ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు కావాలని ఎగ్జామ్లలో పాస్ చేస్తు, ఎక్కువ మార్కులు ఇచ్చారనే ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన యూనీవర్సీటీ అధికారులు.. దీనిపై స్పందించారు. ఘటనపై విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ కమిటీ తన నివేదికలో విద్యార్థులకు ఎక్కువ మార్కులు కేటాయించినట్లు పేర్కొంది.. అని వైస్-ఛాన్సలర్ వందనా సింగ్ అన్నారు. మతపరమైన నినాదాల గురించి అడిగినప్పుడు, ఆమె ఇలా చెప్పింది: "జై శ్రీరామ్ సమాధానాలు ఉన్న కాపీని చూడలేదని, విద్యార్థుల చేతిరాతలు అంత స్పష్టంగా లేదన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌కు రాజ్‌భవన్ లేఖ రాసింది. ఇదిలా ఉండగా.. 'ఫార్మసీ యాజ్ కెరీర్' అనే సమాధానం మధ్యలో జై శ్రీరామ్ అని కనిపించే సమాధాన పత్రాలు ఉన్నట్లు, అదే సమాధానంలో హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి క్రికెటర్ల పేర్లు కూడా ఉన్నాయని కొన్ని మీడియాలో క్లిప్పింగ్ లు వైరల్ గా మారాయి.
ఇలాంటి ఘటనలు.. పునరావృతం కాకుండా ఉండేందుకు ఎగ్జామీనర్లు.. డాక్టర్ వినయ్ వర్మ, మనీష్ గుప్తాలను హెచ్చరించి, సస్పెండ్ చేసినట్లు యూనివర్సీటీ అధికారులు ఒక ప్రకటనలనో వెల్లడించారు. ఇందులో పాల్గొన్న ఉపాధ్యాయులను తొలగించాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే ప్రస్తుతం దేశంలో.. మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉందరి, కోడ్ ఎత్తివేయబడిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోబడతయని విశ్వవిద్యాలయం సిబ్భంది వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter