Delhi Exit Poll 2025 Live Updates: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ పోలింగ్ ముగియగా.. భారీగా ఓటింగ్ నమోదైంది. దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఈ ఎన్నికల్లో విజేత ఎవరో అనేది మూడు రోజుల్లో తేలనుంది. పోలింగ్ ముగిసిన అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించి హ్యాట్రిక్ ఘనత పొందుతుందా? కాంగ్రెస్ పూర్వ వైభవం సాధిస్తుందా? సుదీర్ఘ కాలం తర్వాత ఢిల్లీని బీజేపీ చేజిక్కించుకుంటుందా అనేది ఉత్కంఠ నెలకొంది.
విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇలా ఉన్నాయి..
మొత్తం 70 స్థానాల్లో పార్టీల పోటీ ఇలా
ఆమ్ ఆద్మీ పార్టీ: మొత్తం 70 స్థానాల్లో బరిలో దిగింది (ఇండియా కూటమిలో భాగమైన ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ కలిసి పోటీ చేయలేదు)
కాంగ్రెస్ పార్టీ: 70 స్థానాల్లో పోటీ
ఎన్డీయే కూటమి: బీజేపీ 68, జేడీయూ 1, ఎల్‌జేపీఆర్‌వీ 1 స్థానంలో పోటీ చేయలేదు.
ఎన్నిక ఇలా
మొత్తం 70 స్థానాలు
పోటీ చేసిన అభ్యర్థులు
మొత్తం 699 మంది
మహిళా అభ్యర్థులు
96 మంది
మొత్తం ఓటర్లు
1.56 కోట్లు (పురుషులు83.8 లక్షలు, మహిళలు 72.4 లక్షలు, ఇతరులు 1,267 మంది)