Farmers protest and tweets: నూతన వ్యవసాయ చట్టాలు..రైతుల ఆందోళన..ట్రాక్టర్ ర్యాలీ, హింసాత్మక ఘటనలు..రైతు చట్టాలకు మద్దతుగా ప్రముఖుల ట్వీట్స్. సచిన్ సహా ప్రముఖుల ట్వీట్స్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టనుందని ప్రకటించడం సంచలనమైంది.
కేంద్ర ప్రభుత్వం ( Central government ) తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు ( New farm laws ) వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఉద్యమానికి ( Farmers protest ) మద్దతు తెలుపుతూ పలువురు అంతర్జాతీయ ప్రముఖులు ట్వీట్స్ చేశారు. వీరిలో పాప్ సింగర్ రిహన్నా ( Rihanna ), పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్ ( Greta Thunberg ), మియా ఖలిఫా వంటి వారు ఉన్నారు. భారత్‌లో రైతులు జరుపుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ), ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ( Lata Mangeshkar ), టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ), బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్ తదితరులు రైతు చట్టాలకు మద్దతుగా ట్వీట్స్ చేస్తూ కేంద్రానికి అండగా నిలిచారు. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఇతరులకు లేదని, తమ దేశ సమస్యలను తాము పరిష్కరించుకోగలమని ముక్తకంఠంతో ప్రకటించారు. ఈ పరిణామం దేశంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కేంద్రానికి మద్దతు ప్రకటించడాన్ని సోషల్ మీడియా వేదికగా ఓ వర్గం వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా పలువురు ప్రముఖులు చేసిన ట్వీట్స్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం ( Maharashtra government ) సంచలనం నిర్ణయం తీసుకుంది. ఈ ట్వీట్స్‌పై దర్యాప్తు చేపట్టనున్నామని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ( Maharashtra home minister anil deshmukh ) ప్రకటించడం సంచలనంగా మారింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఒకే విధంగా ట్వీట్స్ చేయడం అనుమానాలకు తావిస్తోందని..దీనిపై ఇంటెలిజెన్స్ సంస్థలు దర్యాప్తు చేస్తాయని అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. వరుస ట్వీట్స్ వెనుక కేంద్ర ప్రభుత్వం లేదా ఇతర వ్యక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్టు మంత్రి తెలిపారు.
Also read: Farmers protest vs Twitter accounts: ఆ ఎక్కౌంట్లు బ్లాక్ చేయాలంటూ కేంద్రం నోటీసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook