ముంబైలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 33 అంతస్తుల అపార్ట్‌మెంట్ భవనం బ్యూమోండ్ టవర్స్ పైన చోటుచేసుకున్న ఈ భారీ అగ్ని ప్రమాదంలో అదృష్టవశాత్తుగా ఎవ్వరికీ, ఎటువంటి హానీ జరగలేదు. భవనంపై ఉన్న వాళ్లందరినీ అగ్ని మాపక సిబ్బంది అక్కడి నుంచి ఖాళీ చేయించి మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. వొర్లిలోని ప్రభాదేవి ప్రాంతంలో ఉన్న అప్పాసాహెబ్ మరాఠే మార్గానికి ఆనుకుని ఉన్న భవనంపై ఈ ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన ఇదే అపార్ట్‌మెంట్‌లోని 26వ అంతస్తులో బాలీవుడ్ నటి దీపికా పదుకునేకి కూడా ఓ ఫ్లాట్ ఉంది. దీపికా పదుకునే ప్రస్తుతం అందులోనే నివాసం ఉంటున్నప్పటికీ, ప్రమాదం జరిగిన సమయంలో ఆమె ఓ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ షూటింగ్ కోసం బయటికి వెళ్లారని ఆమె వ్యక్తిగత సిబ్బంది చెప్పినట్టు తెలుస్తోంది.
#WATCH: Level III fire breaks out in Beau Monde Towers in Worli's Prabhadevi locality. Firefighting operations underway. #Mumbai pic.twitter.com/su2hKDEGr3
— ANI (@ANI) June 13, 2018
ప్రమాదం జరిగిన అపార్ట్‌మెంట్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు, 10 ఫైర్ ఇంజిన్లు, 5 భారీ నీటి ట్యాంకర్లు, 2 హైడ్రాలిక్ ప్లాట్ ఫామ్స్, అంబులెన్సులు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది. అగ్ని ప్రమాదం తీవ్రత మూడో దశలో ఉన్నట్టు చెప్పిన అగ్ని మాపక సిబ్బంది.. ఈ ప్రమాదం గురించి తమకు మధ్యాహ్నం2:16 గంటలకు సమాచారం అందినట్టు తెలిపారు.
Police personnel, at least 10 fire tenders, 5 jumbo tankers, 2 hydraulic platforms & ambulances present at Beau Monde Towers in Worli's Prabhadevi locality where a level-III fire broke out. Firefighting operations underway. #Mumbai pic.twitter.com/XdMP6roNmC
— ANI (@ANI) June 13, 2018