చెన్నై: తమిళులు తమ ఆరాధ్య దైవంగా భావించి, పూజిస్తూ ఆలపించే మురుగన్ పాట 'కంద శష్టి కవచం'పై ( Kandha Sashti Kavacham ) వీడియో సాంగ్ చిత్రీకరించి, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన కేసులో తమిళనాట ప్రముఖ యాంకర్లలో ఒకరైన సురేంద్రన్‌తోపాటు ( Anchor Surendran ) సెంథిల్ వాసన్ అనే మరో వ్యక్తిని బుధవారం తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మురుగన్‌పై భక్తి పారవశ్యంతో తమిళనాట హిందువులు పాడుకునే పాటపై ఇష్టం వచ్చినట్టు వీడియో చిత్రీకరించి ఆ దేవుడిని కూడా కించపర్చారంటూ వీడియో సాంగ్‌ని విడుదల చేసిన కరుప్పర్ కూట్టం ( Karuppar Koottam ) అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులపై తమిళనాట తీవ్ర నిరసన వ్యక్తమయ్యాయి. బీజేపి యువ విభాగం నేత వినోద్ పి సెల్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా ఈ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ( Also read: Work from home: ఐటి ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ )
తమిళనాట సామాజిక మాధ్యమాల్లో తీవ్ర నిరసనలకు కారణమైన వివాదంపై తమిళనాడు సర్కార్ ( Tamilnadu govt ) స్పందిస్తూ.. కరుప్పర్ కూట్టం యూట్యూబ్ ఛానెల్ నుంచి ఆ వీడియోలను తొలగించింది. యూట్యూబ్ ఛానెల్‌పై చర్యలు తీసుకున్నందుకుగాను తమిళనాడు ప్రభుత్వాన్ని అభినందించిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ( Rajinikanth ).. సర్కార్ మంచి పని చేసిందంటూ ప్రశంసలు గుప్పించారు. దేవుడిని కింపపరిచేలా వ్యవహరించే వారిని ఉపేక్షించరాదంటూ రజినీకాంత్ ట్విటర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ( RGV ‘పవర్ స్టార్’ ట్రైలర్ వచ్చేసింది.. )
ఇదిలావుంటే, ఇప్పటికే ఈ వివాదంపై స్పందించిన తమిళనాడు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్ ( L Murugan ).. కరుప్పర్ కూట్టం యూట్యూబ్ చానెల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఆ రాష్ట్ర డీజీపీ తిరు జేకే త్రిపాఠికి ఫిర్యాదు చేశారు.
ఈ వివాదంపై ఇటీవలే తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి సెవూర్ ఎస్ రామచంద్రన్ స్పందిస్తూ.. కరుప్పర్ కూట్టం అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 19వ శతాబ్ధంలో మురుగన్‌ని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఆలపించిన కంద శష్టి కవసం గానంతోనే తమిళనాట ఎంతోమందికి శుభోదయం కలుగుతుందని.. అంత పవిత్రమైన పాటను కించపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మంత్రి రామచంద్రన్ హెచ్చరించారు. ( Nithin Engagement: ప్రేయసి షాలినితో హీరో నితిన్ ఎంగేజ్మెంట్ )