Bank Holidays in August 2024: ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ చెల్లింపులే జరుగుతున్నాయి. యూపీఐ చెల్లింపులు, ఆన్‌లైన్ డిజిటల్ లావాదేవీలు పెరిగిపోయాయి. అంటే ఇంట్లో కూర్చునే బ్యాంకింగ్ పనులు పూర్తవుతున్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం బ్యాంకుకు వెళ్లక తప్పని పరిస్థితి ఉంటుంది. అందుకే బ్యాంకులకు సెలవులు ఎప్పుడున్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది.
ఆగస్టు నెల బ్యాంకు సెలవుల్ని రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే 13 రోజులు పూర్తయ్యాయి. ఇక సగం నెలే మిగిలింది. కానీ రానున్న 15 రోజుల్లో కూడా బ్యాంకులకు చాలా సెలవులున్నాయి. వచ్చే 15 రోజుల్లో 6 రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి. లాంగ్ వీకెండ్ కూడా ఉంది. అందుకే రానున్న 15 రోజుల్లో మీకు బ్యాంకు పనులుంటే ఈ సెలవుల ఆధారంగా ప్లాన్ చేసుకోండి. ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ఓసారి చెక్ చేద్దాం
ఆర్బీఐ సెలవుల జాబితా ప్రకారం ఆగస్టు 15 నుంచి ఆగస్టు 19 వరకూ మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే, ఆగస్టు 18 ఆదివారం, ఆగస్టు 19 రక్షాబంధన్ సెలవులున్నాయి. ఆగస్టు 19 రక్షాబంధన్ రోజున కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయనున్నాయి. త్రిపుర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు ఆగస్టు 19న పనిచేయవు. ఆగస్టులో నేషనల్ హాలిడేస్ ఇండిపెండెన్స్ డే, రక్షాబంధన్, కృష్ణ జన్మాష్టమి ఉన్నాయి.
ఇవాళ ఆగస్టు 13న మణిపూర్‌లో పేట్రియాట్ డే సెలవు ఉంది. ఆగస్టు 15న దేశమంతా ఇండిపెండెన్స్ డే సెలవు. ఇక ఆగస్టు 19న కొన్ని రాష్ట్రాల్లో రక్షాబంధన్ సెలవు ఉంటుంది. ఆగస్టు 20న కేరళలో శ్రీ నారాయణ గురు జయంతి సెలవు ఉంది. ఆగస్టు 26 తేదీన జన్మాష్ఠమి సెలవులు దాదాపు దేశమంతా ఉంటుంది.
Also read: Smart Phone Tricks: ఫోన్ పోగొట్టుకున్నారా, ఈ ట్రిక్స్ పాటిస్తే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook