Gay Advocate: గే న్యాయవాదిని న్యాయమూర్తిగా మరోసారి సిఫారసు చేసిన సుప్రీంకోర్టు

Gay Advocate: గే న్యాయవాదిని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన సిఫార్సుల్ని మరోసారి పునరుద్ఘాటించింది. అంతేకాకుండా..ఈ విషయమై కేంద్రంతో నెలకొన్న అభ్యంతరాల్ని సైతం బహిర్గతం చేసింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 22, 2023, 03:27 PM IST
Gay Advocate: గే న్యాయవాదిని న్యాయమూర్తిగా మరోసారి సిఫారసు చేసిన సుప్రీంకోర్టు

సీనియర్ న్యాయవాది, గే లాయర్ సౌరభ్ కిర్పాల్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం మరోసారి పునరుద్ఘాటించింది. వాస్తవానికి సౌరభ్ కిర్పాల్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ ఐదేళ్ల క్రితం అంటే..2017 అక్టోబర్ 13వ తేదీన ఢిల్లీ హైకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుల్ని సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ నియామకంపై అభ్యంతరాలు తెలిపింది. 

దీనికి రెండు కారణాలు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఆ న్యాయవాది గే అని..అతని భాగస్వామి స్విస్ పౌరుడని వివరించింది. కేంద్రం తెలిపిన అభ్యంతరాల్ని సుప్రీంకోర్టు ఈసారి బహిర్గతం చేసింది. సాధారణంగా కొలీజియం సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలు, కొలీజియం ఇచ్చే వివరణ ఎప్పుడూ రహస్యంగానే ఉంటాయి. కానీ ఈసారి కొలీజియం విషయంలో కేంద్ర ప్రభుత్వంతో న్యాయవ్యవస్థ సై అంటే సై అనడంతో బహిర్గతం చేసినట్టు తెలుస్తోంది. 

రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ రా నివేదిక ప్రకారం అతడి భాగస్వామి వ్యక్తిగత నడవడిక, ప్రవర్తనతో దేశభద్రతకు ముప్పుండే అవకాశం లేదని సుప్రీంకోర్టు కొలీజియం తన వివరణలో తెలిపింది. సౌరభ్ కిర్పాల్ భాగస్వామితో దేశానికి ముప్పుందని భావించలేమని..అంతకుమించి స్విస్ మిత్రదేశమేనని సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు ఎస్‌కే కౌల్, కేఎం జోసెఫ్‌ల సంతకాలతో లేఖ విడుదలైంది. 

రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న చాలామందికి విదేశీ పౌరులు భాగస్వాములుగా ఉన్నారని..అదే విధంగా గే పౌరుల హక్కుల్ని సుప్రీంకోర్టు గతంలో సమర్దించినందున సౌరభ్ కిర్పాల్ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించలేమని కొలీజియం తెలిపింది. న్యాయమూర్తి పదవికి కావల్సిన అన్ని అర్హతలు ఆయనలో ఉన్నాయని..ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తే బెంచ్‌లో కూడా బహుళత్వం, సంఘటిత రూపం ఉంటుందని వివరించింది. 

మొత్తానికి వరుసగా మూడోసారి సౌరభ్ కిర్పాల్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈసారైనా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కొలీజియం విషయంలో సుప్రీంకోర్టుకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వాద ప్రతివాదాలు జరుగుతూనే ఉన్నాయి. 

Also read: Old Pension Scheme: ఆ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పాత పెన్షన్ విధానంపై సీఎం కీలక ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News