Jayalalithaa Assets: జయలలిత ఆస్తులు తమిళనాడుకే..! మొత్తం విలువ ఎంతంటే..?

Jayalalithaa Assets:  దివంగత తమిళనాడు సీఎం జయలలిత ఆస్తుల వ్యవహారం 9 యేళ్ల తర్వాత ఇప్పటికి కొలిక్కి వచ్చింది. తాజాగా జయలలితకు చెందిన 4వేల కోట్ల రూపాయల ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి చేరాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారులు అప్పగించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 16, 2025, 07:40 AM IST
Jayalalithaa Assets: జయలలిత ఆస్తులు తమిళనాడుకే..! మొత్తం విలువ ఎంతంటే..?

Jayalalithaa Assets: బెంగళూరు పరప్పన అగ్రహార కారాగారంలో ఇప్పటి వరకు జయలలిత ఆస్తులు, పత్రాలను భద్రపరిచారు. 10వేల  చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు, 601 కిలోల వెండి వస్తువులు, ఒక వెయ్యి 672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8 వేల 376 పుస్తకాలు తదితరాలను తీసుకెళ్లేందుకు భారీ భద్రతతో అధికారులు ఆరు ట్రంకు పెట్టెలు తీసుకువచ్చారు. న్యాయమూర్తి హెచ్ఎన్ మోహన్ సమక్షంలో వాటిని అధికారులకు అప్పగించారు.

చక్రవర్తుల ఖజానాను తలపించేలా ఉన్న జయలలిత ఆస్తుల వివరాలు చూసి జనం ఒకింత సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. జప్తు చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువను రూ.913.14 కోట్లుగా అధికారులు మదింపు వేయగా.. అది నేడు కనీసం 4వేల కోట్లుగా ఉండొచ్చని అనధికారికంగా చెబుతున్నారు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..

జయలలిత అక్రమార్జనకు సంబంధించిన కేసు 2004లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ అయినప్పుడు అక్కడ జప్తు చేసిన ఆస్తుల, పత్రాలను ఇక్కడికి తీసుకువచ్చి భద్రపరిచారు. మరోవైపు తాము జయలలితకు వారసులమని, ఆ ఆస్తులను తమకే అప్పగించాలని జె.దీపక్, జె.దీప అనే వ్యక్తులు దాఖలు చేసిన అర్జీని కర్ణాటక హైకోర్టు ఇదివరకే కొట్టివేసింది. దాన్ని సవాల్ చేస్తూ వారు సర్వోన్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్ ను సైతం సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. దాంతో ప్రభుత్వానికి కోర్టు అధికారులు జయలలిత ఆస్తులను అప్పగించారు.

ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News