PM కిసాన్ సమ్మాన్ నిధి యొక్క 15వ విడత డబ్బులు త్వరలో రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుందని నివేదికలు వెల్లడించాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యొక్క రూ. 2000 దీపావళికి ముందు రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుందని అంచనా వేస్తున్నారు.
PM కిసాన్ సమ్మాన్ 15వ విడత తేదీ:
PM కిసాన్ సమ్మాన్ యోజన కింద 8.5 కోట్ల మంది లబ్ధిదారుల రైతుల బ్యాంకు ఖాతాలలో 15వ విడత అధికారిక పంపిణీ త్వరలో విడుదల చేయనున్నారు. దాదాపు అక్టోబర్ నుండి నవంబర్ త్రైమాసికానికి PM కిసాన్ 15వ విడతను వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ విడుదల చేయనున్నట్లు సమాచారం. PM కిసాన్ సమ్మాన్ పథకం పొందేందుకు నమోదు చేసుకున్న రైతులు 15వ వాయిదా కోసం ఎదురుచూస్తున్నారు. దీనిని దీపావళికి ముందు వారి ఖాతాలకు రూ.2000 బదిలీ చేయనున్నారు.
PM కిసాన్ సమ్మాన్ 15వ విడత
PM కిసాన్ సమ్మాన్ 14వ విడత దాదాపు 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో అధికారికంగా జూలై 27, 2023న బదిలీ చేయబడింది. ఇక PM కిసాన్ సమ్మాన్ 15వ విడత ఈ నెల అంటే నవంబర్ లో విడుదల అవ్వొచ్చని భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు వారి పంట దిగుబడిని పెంచడానికి ఆర్థిక సహాయంగా 2000 రూపాయలను దరఖాస్తు చేసుకున్న వారి అకౌంట్లో విడుదల చేయటం ప్రారంభించింది. నిజానికి PM కిసాన్ సమ్మాన్ 15వ విడత నవంబర్ 27న విడుదల అవుతుందని భావించారు.
PM కిసాన్ 15వ విడత కోసం ఎలా నమోదు చేసుకోవాలి..?
- PM కిసాన్ నమోదు చేసుకోవడానికి, రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన www.pmkisan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- నిబంధనలు మరియు షరతులను చదివిన తర్వాత.. దరఖాస్తుదారులు PMKSNY రిజిస్ట్రేషన్ బటన్‌పై క్లిక్ చేసి.. ఆపై అప్లై బటన్‌పై క్లిక్ చేయాలి.
- తరువాత లబ్ధిదారులు PMKSNY రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూర్తిగా చేయాలి. ఇందులో మొత్తం అప్లై చేసే వారి వ్యక్తిగత సమాచారం, అతని పేరుపై రిజిస్టర్ అయి ఉన్న భూమి మరియు బ్యాంక్ ఖాతా సంబంధించిన సమాచారం ఉంటాయి.
- అభ్యర్థులు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను స్కాన్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
Also Read: New Rules From Today: నేటి నుంచి కొత్త రూల్స్ అమలు.. తప్పకుండా తెలుసుకోండి..!
PM కిసాన్ సమ్మాన్ 15వ విడత విడుదల తేదీ..
మీరు PM కిసాన్ సమ్మాన్ 15వ విడతకు అర్హులో కాదో తెలుసుకోవడానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లో చూడాల్సి ఉంటుంది. 14వ విడత చెల్లింపు డేటా ప్రకారం.. జూలై 27న దాదాపు 8.5 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.2000 నగదు బదిలీ చేయబడింది.
PM కిసాన్ 15వ విడతకు అర్హత..
PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం అప్లై చేసూకోటానికి ముందు.. అర్హతలు చెక్ చేసుకోవాలి. ఒక వేళ మీరు అనర్హులు అయితే లబ్ధిదారుల జాబితాలో మీ పేరు కనిపించవచ్చు. PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ది పొందాలంటే.. ఆ వ్యక్తి తన పేరు పైన 2 హెక్టార్ల భూమి నమోదై ఉండాలి. అంతేకాకుండా.. దరఖాస్తు చేసుకునే వ్యక్తి కుటుంబ ఆదాయం PMKSNY అధికారుల గరిష్ట ఆదాయాన్ని మించకూడదు.
15వ విడత కోసం PM కిసాన్ లబ్ధిదారుల జాబితా..
PM కిసాన్ లబ్ధిదారుల డబ్బులు పంపిణీ చేసే ముందు ప్రభుత్వం 15వ విడత లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తుంది. విడుదల చేయనున్న జాబితా పూర్తిగా వివరాలు ఉంటాయి. ఇప్పటివరకు ప్రభుత్వం PM కిసాన్ 15వ విడత విడుదల తేదీ ఖరారు కానప్పటికీ.. నవంబర్ 2023 రెండవ వారంలో 15వ విడత జమ కానుందని సమాచారం.
PM కిసాన్ 15వ విడతకు అవసరమైన పేపర్లు
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా రైతులు అనేక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పాత్రల ఆధారంగా రైతులు పథకం ప్రయోజనాలకు అర్హులో కాదో ప్రభుత్వం నిర్ధారించడానికి అనుమతిస్తుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం రిజిస్టర్ చేసుకోవడానికి అవసరమైన కొన్ని పేపర్లు ఇవే
- ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్
- భూమి రికార్డులు మరియు యాజమాన్య పత్రాలు
- పాస్‌బుక్ మరియు స్టేట్మెంట్లతో సహా బ్యాంకు ఖాతా సమాచారం
- అడ్రస్ ప్రూఫ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..