Zika Virus cases reported in Kerala ahead of third wave: తిరువనంతపురం: కరోనావైరస్ ఇంకా తగ్గుముఖం పట్టకముందే కేరళలో తొలిసారిగా జికా వైరస్ కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. వచ్చే నెలలో కరోనా థర్డ్ వేవ్ దేశాన్ని ఇబ్బంది పెట్టనుందనే అంచనాల మధ్యే దోమ కాటు ద్వారా వ్యాపించే జికా వైరస్ కేసులు గుర్తించడం కేరళ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో (NIV in Pune) పరిశీలించిన నమూనాల ప్రకారం కనీసం 13 మందికి జికా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తేలింది.
కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారి రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలోనే జికా వైరస్ కేసులు కూడా గుర్తించినట్టు ధృవీకరించారు. కేరళలో జికా వైరస్ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం జిల్లాలోని ఒక ఆసుపత్రిలో 24 ఏళ్ల గర్భిణీ (Zika virus symptoms in pregnant women) గత నెలలో జ్వరం, తలనొప్పి, దద్దుర్లు సమస్యతో బాధపడుతున్నట్టు తేలింది. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో తొలుత జికా వైరస్ తేలికపాటి లక్షణాలు ఉన్నట్టు సంకేతాన్ని చూపించాయి. ఆ తరువాత పరీక్షించిన 19 నమూనాల్లో 13 కేసుల్లో జికా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యాయి.
Also read: Dengue cases in Hyderabad: హైదరాబాద్‌లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు
" కేరళ ఆరోగ్య శాఖ, తిరువనంతపురం జిల్లా ఉన్నతాధికారులు జికా వైరస్ కేసులను తీవ్రంగా పరిగణిస్తూ తదుపరి చర్యలకు పూనుకుంటున్నారు. ఈడెస్ జాతుల దోమల నమూనాలను సేకరించి చర్యలు తీసుకున్నారు. ఈడెస్ జాతి దోమ కాటు (Aedes mosquitoes bites) ద్వారా జికా వైరస్ ప్రజలకు వ్యాపిస్తుంది. తిరువనంతపురం 13 జికా వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో అన్ని జిల్లాలను అప్రమత్తం చేసినట్టు వీణా జార్జ్ మీడియాకు తెలిపారు.
జికా వైరస్ బారిన పడిన వారిలో ఎక్కువ మందిలో జికా వైరస్ లక్షణాలు పూర్తిగా రాకపోయినప్పటికీ, వారిలో కొందరికి జ్వరం, దద్దుర్లు, కండ్లకలక, కండరాలు, కీళ్ల నొప్పులు, అనారోగ్యం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. జికా వైరస్ లక్షణాలు సాధారణంగా 2–7 రోజులు పాటు ఉంటాయి. దోమ కాటు (Mosquitoes bites) ద్వారానే ఈ వైరస్ ఎక్కువగా సంక్రమిస్తుంది. ఎక్కువగా ఈడెస్ ఈజిప్టి రకం దోమలు డెంగ్యూ, చికున్‌గున్యా, పసుపు జ్వరాలను (Yellow fever) వ్యాపింపచేస్తాయి.
Also read: Health benefits of eating almonds: రోజుకు రెండుసార్లు బాదం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఈడెస్ దోమలు సాధారణంగా పగటిపూట కరుస్తాయి. జికా వైరస్ లక్షణాలు గర్భిణీ స్త్రీలను ఇబ్బందులకు గురిచేస్తాయి. జికా వైరస్ లక్షణాలు (symptoms of Zika virus) చికున్‌గున్యా లక్షణాల తరహాలోనే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
Also read: AP Corona Update: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా వైరస్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook