Weight loss Diet Plan: 28 కిలోల బరువు తగ్గించిన దీక్షా డైట్ ప్లాన్ ఇదే వెంటనే మొదలెట్టండి

Weight loss Diet Plan: ఆధునిక జీవన విధానంలో అధిక బరువు, స్థూలకాయం అతి పెద్ద సమస్యగా మారుతోంది. మీరు కూడా ఇదే సమస్యతో బాధడుతుండి, ఎంత ప్రయత్నించినా ఫలితాలు లేకపోతే మీకోసం బెస్ట్ డైట్ ప్లాన్ ఇది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 20, 2025, 07:52 PM IST
Weight loss Diet Plan: 28 కిలోల బరువు తగ్గించిన దీక్షా డైట్ ప్లాన్ ఇదే వెంటనే మొదలెట్టండి

Weight loss Diet Plan: ఇదేమీ ఆషామాషీ డైట్ ప్లాన్ కాదు. ఓ యువతి ఎంతో శ్రమించి ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా 28 కిలోలు తగ్గించుకుంది. ఆ డైట్ ప్లాన్‌ను, ఫ్యాట్ తగ్గించే అంశాలను షేర్ చేసింది. బరువు తగ్గించుకోవాలనుకునేవారికి ఇది ప్రేరణగా నిలుస్తోంది. ఆ డైట్ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం.

ఇది స్వతహాగా న్యూట్రిషనిస్ట్ అయిన ఇన్‌స్టా యూజర్ దీక్షా అక్సర్ వెయిట్ లాస్ జర్నీ. హెల్తీ రెసిపీ ద్వారా ఏకంగా 28 కిలోల బరువు తగ్గించుకుంది. వెయిట్ లాస్ జర్మనీకు దోహదపడే డైట్ ప్లాన్ ఇది. బరువు తగ్గించేందుకు దారితీసే ఇతర అంశాల్ని కూడా షేర్ చేసింది. ఈమె బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లో ఏం తినాలి, స్నాక్స్‌లో ఏం తినాలనేది వెల్లడించింది. ఈ వెయిట్ లాస్ జర్నీలో తాను 28 కిలోలు తగ్గించుకున్నట్టు తెలిపింది. 

మార్నింగ్ డ్రింక్ అండ్ బ్రేక్‌ఫాస్ట్...

ఆప్షన్ 1లో భాగంగా ధనియాలు, వాము, అల్లం నీరు అయితే ఆప్షన్ 2లో జీలకర్ర నీళ్లు తీసుకోవాలి. మార్నింగ్ డ్రింక్ తరువాత మెటబోలిజం వేగవంతమయ్యేందుకు కాస్త వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఆప్షన్ 1లో ఒక గుడ్డు, 1 ప్యాకెట్ మష్రూం తీసుకోవాలి. ఆప్షన్ 2లో పెసరట్టు కూరగాయలు, పుదీనా చట్నీతో తినాలి. 

లంచ్‌లో..

ఆప్షన్ 1లో చికెన్, హమ్మస్ సలాడ్ తీసుకోవాలి. ఆప్షన్ 2లో శెనగలు, హమ్మస్ సలాడ్ అవసరమౌతుంది. మద్యాహ్నం భోజనం తరువాత కాస్త వ్యాయామం చేయాలి. 

ఈవెనింగ్ స్నాక్స్ అండ్ డిన్నర్

మీకు సాయంత్రం వేళ ఆకలి వేస్తే గుప్పెడు ఫ్రై చేసిన శెనగలు లేదా 1 ఫ్రూట్, 5 నట్స్ తినాలి. ఇక రాత్రి భోజనంలో ఆప్షన్ 1లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ చికెన్ సూప్, ఆప్షన్ 2 పాలకూర సూప్, అర కప్పు ఉడికించిన స్ప్రౌట్స్ తీసుకోవాలి. 

వెయిట్‌లాస్ జర్నీకు దారి తీసే ఇతర అంశాలు

బరువు తగ్గించేందుకు డైట్ ప్లాన్‌ తో పాటు ఇతర అంశాల్ని కూడా పరిగణించాలని దీక్షా అక్సర్ తెలిపింది. ఈమె అందించిన వివరాల ప్రకారం వారంలో నాలుగైదురోజులు వ్యాయామం రోజుకు 45 నిమిషాలు చేయాలి. ఫిజికల్ యాక్టివిటీల్లో భాగంగా శరీరం పూర్తిగా యాక్టివ్‌గా ఉండేట్టు చూసుకోవాలి. అంటే రోజంతా శరీరం ఖాళీగా ఒకేచోట ఉంచకుండా ఏదో ఒక పనిచేస్తుండాలి. దీని ద్వారా చాలా ఎనర్జీ ఖర్చవుతుంది. రోజుకు కనీసం 1000 అడుగులు నడవాలంటోంది. మీ ప్రేవుల ఆరోగ్యం కోసం రోజూ 3 లీటర్ల నీళ్లు తప్పకుండా తాగాలి. ఫలితంగా మెటబోలిజం వేగవంతమౌతుంది

నిద్ర, ఒత్తిడి కూడా బరువు తగ్గించుకునే క్రమంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. అందుకే రోజూ తగినంత నిద్ర తప్పకుండా ఉండాలి. తద్వారా ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. ఇక డిన్నర్ విషయంలో కొన్ని సూచనలు చేసింది. డిన్నర్ రోజూ త్వరగా పూర్తి చేయాల్సి ఉంటుంది. రోజూ సాయంత్రం 7 గంటలకు డిన్నర్ పూర్తయితే మంచిది. మంచి ఫలితాలుంటాయి. 

Also read: 8th Pay Commission Impact: 8వ వేతన సంఘంతో కళ్లు చెదిరేలా జీతాల పెంపు, భారీగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, ఎంతంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News