Coconut For Hair Growth: కొబ్బరినూనెలో విటమిన్ ఇ ఉంటుంది. అంతేకాదు ఇందులో ఫ్యాటీ యాసిడ్స్‌తోపాటు విటమిన్ కే ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు కలిగి ఉంటుంది. దీంతో చుండ్రు తగ్గిపోతుంది జుట్టు ఊడటం కూడా ఆగిపోతుంది. మళ్లీ తిరిగి పెరుగుతుంది. కొబ్బరినూనెతో ట్రై చేయాల్సిన కొన్ని మాస్క్‌లు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
కొబ్బరినూనె, కలబంద..
ఈ రెండూ జుట్టుకు మంచి పోషణ అందిస్తాయి. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరినూనె, కలబంద రెండిటినీ మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల చుండ్రు తగ్గిపోతుంది. దీన్ని తలస్నానం చేసే ముందు జుట్టు అంతటికీ అప్లై చేసి ఓ 20 నిమిషాలు ఆరిన తర్వాత హెయిర్ వాష్ చేయాలి. దీంతో జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
అవకాడో..
కొబ్బరి నూనెలో సగం అవకాడో గుజ్జు వేసి కలపాలి. దీన్ని జుట్టు కుదుళ్లకు బాగా అప్లై చేయాలి. ఓ అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ మాస్క్ పొడిబారిన జుట్టుకు ఎఫెక్టీవ్ రెమిడీ. జుట్టును బలంగా మారుస్తుంది. ముఖ్యంగా స్ల్పిట్ ఎండ్ సమస్య ఉన్నవారికి ఎఫెక్టీవ్ రెమిడీ.ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు అవకాడో, కొబ్బరి నూనె మాస్క్ ఎఫెక్టీవ్ రెమిడీ..
కొబ్బరి నూనె, టీ ట్రీ ఆయిల్..
కొబ్బరినూనెతో టీ ట్రీ ఆయిల్ కొన్ని చుక్కలను మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. మాస్క్ మాదిరి అప్లై చేయాలి. ఆ తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇలా తరచూ జుట్టుకు టీ ట్రీ ఆయిల్, కొబ్బరి నూనె కలిపి అప్లై చేయడం వల్ల కుదుళ్లు దృఢంగా మారతాయి. తలలో చుండ్రు తగ్గిపోతుంది.
తేనె..
కొబ్బరినూనె, తేనె రెండు కలిపి జుట్టు అంతటికీ పట్టించాలి. కొబ్బరి నూనె, తేనె కలిపి జుట్టు అంతటికీ మాస్క్ చేయాలి. ముందుగా కొబ్బరినూనె వేడి చేసి అందులో తేనె వేసే కలపాలి. ఈ మాస్క్‌ను జుట్టుకు అప్లై చేయడం వల్ల కుదుళ్లకు పునరుజ్జీవనం అందుతుంది. ఆ తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయాలి.
ఇదీ చదవండి: ఫిబ్రవరి ప్రారంభం ముందే ఉక్కపోత షురూ.. రెండు రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలు..
నిమ్మరసం..
కొబ్బరి నూనె, నిమ్మరసం రెండూ కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఈ మాస్క్ వల్ల తలపై ఉన్న చుండ్రు పూర్తిగా పత్తా లేకుండా పోతుంది. దీనికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి కెమికల్స్ అతిగా ఉండే ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన పని లేదు. కొబ్బరి నూనెలో నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఓ అరగంట జుట్టు ఆరనివ్వాలి. సాధారణ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ హెయిర్ మాస్క్ జుట్టు పెరగడానికి ప్రేరేపిస్తుంది. ఆరోగ్యకరమైన కుదుళ్లకు తోడ్పడుతుంది.
ఇదీ చదవండి: రెండు రోజులు సెలవులు.. నేటి బడ్జెట్‌లో ప్రకటన..?
కొబ్బరి నూనె చుండ్రు తగ్గించడంతోపాటు పలుచబడిన జుట్టుకు ఎఫెక్టీవ్ రెమిడ. జుట్టు కుదుళ్లకు హైడ్రేషన్ అందిస్తుంది. కుదుళ్లపై ఉన్న ఫంగస్‌ను తగ్గిస్తుంది. అంతేకాదు తల దురద ఉన్నవారికి ఎఫెక్టీవ్ రెమిడీ. జుట్టు పెరుగుదలకు బూస్టింగ్ ఇస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.