How To Stop Heart Attack: ఇప్పటికే గుండెపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర వ్యాధులైన ఆర్టరీ డిసీజ్, హైబీపీ, హార్ట్ ఎటాక్‌తో పాటు కొందరిలో మధుమేహం సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎంతో కొంతనై గుండె సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
వానా కాలంలో ఆరోగ్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి:
అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వానా కాలంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా గుండెలో మంట ఇతర సమస్యలు ఉంటే తప్పకుండా తరచుగా కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శారీరక శ్రమతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది బరువు కారణంగా చాలా మంది గుండె పోటు బారిన పడుతున్నారు. కాబట్టి తప్పకుండా ఊబకాయాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది.
Also Read: Viral Video: జేసీబీపై దూసుకువచ్చిన భారీ బండరాళ్లు.. క్షణాల్లో తప్పించుకున్న డ్రైవర్.. వీడియో వైరల్
వానా కాలంలో ఈ చిట్కాలు తప్పని సరి:
ఆరోగ్యకరమైన జీవనశైలి:
గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఆధునిక జీవనశైలిని అనుసరించడం మానుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా డాక్టర్ సూచించిన వ్యాయామాలతో పాటు, ఔషధాలను తప్పకుండా తీసుకోవాలి. అయితే చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. వీటికి బదులుగా ప్రోటీన్స్ కలిగిన ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. డైట్‌లో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా ప్రాణాంతక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
వైద్యులను తప్పకుండా సంప్రదించాల్సి ఉంటుంది:
హార్ట్ పేషెంట్లు ప్రతి రోజు కార్డియాలజిస్టులను సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఆసుపత్రికి వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ఆన్‌లైన్ కన్సల్టేషన్‌కి రిఫర్ చేస్తున్నారు. అయితే ఇలా చేయడం మానుకోవాల్సి ఉంటుంది. మీకు వీలున్నప్పుడు వైద్యులను నేరుగా సంప్రదించాల్సి ఉంటుంది. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఉప్పగా ఉండే ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Viral Video: జేసీబీపై దూసుకువచ్చిన భారీ బండరాళ్లు.. క్షణాల్లో తప్పించుకున్న డ్రైవర్.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook