Side Effects of Vitamins Deficiency: విటమిన్స్‌ లోపం వల్ల కలిగే దుష్ప్రభావాలు..? ప్రయోజనాలు ఇవే!

Importance of Vitamins & Minerals: ప్రస్తుతం చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణాలు విటమిన్ లోపమేనని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 11, 2023, 06:28 PM IST
Side Effects of Vitamins Deficiency: విటమిన్స్‌ లోపం వల్ల కలిగే దుష్ప్రభావాలు..? ప్రయోజనాలు ఇవే!

Know the Importance of Vitamins & Minerals: మన శరీరానికి రోజూ చాలా రకాల పోషకాలు అవసరమవుతాయి. శరీరంలో ఒక్క పోషకం లోపించిన చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి రోజూ పోషకాహారాలు తీసుకోవడం చాలా మంచిది. లేకపోతే శరీర బలహీనంగా,  అలసట సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ప్రతి రోజూ తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. శరీరానికి విటమిన్‌ ఎందుకు అవసరం, వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

విటమిన్స్‌ లోపం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
విటమిన్‌ A, B, C, D, E, K వంటి సమస్యలతో బాధపడేవారు చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడతారు. వీటి లోపం వల్ల శరీరం బలహీనంగా మారుతుంది. అంతేకాకుండా ఎముకలు కుంచించుకుపోతాయి..కండరాలలో నొప్పులు మొదలవుతాయి. అంతేకాకుండా చాలా రకాల జుట్టు సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి విటమిన్స్‌ లోపం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఎలాంటి వారికి ఎక్కువ విటమిన్లు కావాల్సి వస్తుంది?
విటమిన్‌ సమస్యల బారిన ఎక్కువగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు పడుతూ ఉంటారు. కాబట్టి వీరు తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాల లోపం సమస్యలతో బాధపడేవారు పండ్లు, ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read:  White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!

మల్టీవిటమిన్లు తప్పనిసరిగా తినాల్సి ఉంటుంది:
శరీరంలో పోషకాల లోపం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మల్టీవిటమిన్ సప్లిమెంట్లను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల లోపం తొలగిపోవడమే కాకుండా క్రోమియం, జింక్, సెలీనియం, ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరానికి లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

మల్టీవిటమిన్‌లు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
మల్టీవిటమిన్స్‌ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బాడీకి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి శరీరాన్ని శక్తి వంతంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కాబట్టి నొప్పులు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మల్టీవిటమిన్ తీసుకోవాల్సి ఉంటుంది.

(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read:  White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News