Insomnia Causes: మనలో చాలా మంది రాత్రిళ్లు నిద్రించే ముందు లేదా నిద్రపోకుండా మొబైల్ ఫోన్స్ వాడుతుంటారు. అయితే ఈ వ్యసనం కారణంగా కంటి నిండా నిద్ర పోవడం లేదు. సెల్ ఫోన్స్ వల్లనే తమ నిద్రకు భంగం కలుగుతుందని ఎక్కువ శాతం మంది అభిప్రాయపడుతున్నట్లు ఓ సర్వేలో తేలింది.
నిద్రలేమితో బాధపడుతూ..
భారతదేశంలోని అనేక మెట్రోపాలిటన్ నగరాల్లో నివసించే ప్రజలు సరైన నిద్ర పోవడం లేదని ఓ సర్వేలో తేలింది. అంటే ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు నిద్రలేమి వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దేశంలోని 59 శాతం మంది ప్రజలు రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారు. మొబైల్ వాడకమే అందుకు కారణం.
సోషల్ మీడియా కారణంగా 36 శాతం మంది ప్రజలు నిద్రను కోల్పోతున్నారని తెలుస్తోంది. అందులో 18 నుంచి 24 ఏళ్ల వయసున్న యువకులు రాత్రిళ్లు ఎక్కువగా నిద్రించడం లేదని సర్వేలో తేలింది.
కరోనా కారణంగా..
కరోనా సంక్షోభానికి ముందుతో పోలిస్తే రాత్రిపూట సోషల్ మీడియాలో సమయం గడిపే వారి సంఖ్య ఇప్పుడు 57 శాతం పెరిగింది. అందులో 31 శాతం మంది స్త్రీలు, 23 శాతం మంది పురుషులు సోషల్ మీడియా ద్వారా తమ నిద్రను కోల్పోతున్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా..
కరోనా సంక్షోభంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా చాలా మంది ఎక్కువగా నిద్రలేమితో బాధపడుతున్నారు. దీని కారణంగా రాత్రిళ్లు నిద్రపోయే సమయాన్ని తగ్గిస్తున్నారు. 2020 సర్వే ప్రకారం 83 శాతం మంది రాత్రిళ్లు నిద్రపోయేవారని.. ఇప్పుడు అంటే 2022లో 48 శాతం మంది మాత్రమే రాత్రి సరైన సమయానికి నిద్రిస్తున్నారని తెలుస్తోంది.
Also Read: Smartphone Hacks: పగిలిన స్మార్ట్ ఫోన్ డిస్ ప్లేను ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు!
Also Read: White Hair Solution: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఈ నూనెను వాడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook